డీల్ జరిగిన మాట వాస్తవం.. కానీ అవన్నీ అబద్దాలే.. ఓపెన్ అయిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంచెలంచెలుగా తండ్రి చిరంజీవి లాగే స్వయం కృషితో ఎదుగుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోగా కీర్తించబడుతున్న ఆయన.. స్టార్ ప్రొడ్యూసర్‌గా కూడా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తూ నిర్మాతగా సత్తా చాటుతున్నారు. ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' రూపంలో భారీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన చెర్రీ.. మరో రీమేక్ సినిమా రూపొందించేందుకు రెడీ అవుతున్నారు.

రామ్ చరణ్, చిరంజీవి స్క్రీన్ షేరింగ్
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమా విశేషాలు, ఇతర విషయాలపై ఓపెన్ అయ్యారు రామ్ చరణ్. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన 'లూసిఫర్' సినిమా రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ చేజిక్కుంచుకుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తారని టాక్ నడుస్తోంది.

అది వాస్తవం.. ఇది రూమర్
ఈ విషయమై రామ్ చరణ్ స్పందించారు. ‘లూసిఫర్' సినిమా తెలుగు రీమేక్‌లో పృథ్వీరాజ్ పాత్రలో తాను నటించబోతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పేశారు చెర్రీ. 'లూసిఫర్' రీమేక్ విషయానికి వస్తే హక్కులు కొన్న మాట వాస్తవమే తప్పితే.. తాను నటించనున్నది మాత్రం రూమర్ అని పేర్కొన్నారు రామ్ చరణ్. ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారన్నది త్వరలోనే తెలియజేస్తాం అని ఆయన చెప్పారు.

చిరు 152.. రామ్ చరణ్ రోల్
ఇదిలా ఉంటే మరోవైపు చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిరు 152 సినిమాలోనూ రామ్ చరణ్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా స్పందించిన చెర్రీ.. అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం నాన్న కొరటాల, త్రివిక్రమ్‌ల కథలు వింటున్నారని, అందులో తనకు సరిపోయే పాత్ర ఏమైనా ఉందో లేదో తనకైతే తెలియదని రామ్ చరణ్ అన్నారు.

చిరంజీవి బయోపిక్.. చెర్రీ రియాక్షన్
తాను ఫలానా పాత్రలో చేస్తే బాగుంటుందని చిరంజీవి గారు అనుకుంటే.. తాను కచ్చితంగా చేస్తానని ఈ సందర్బంగా వెల్లడించారు రామ్ చరణ్. అలాగే చిరంజీవి బయోపిక్ పై కూడా స్పందించిన ఆయన.. తన తండ్రి సినిమాలను రీమేక్ చేయడానికి తాను ఇష్టపడనని, తానైతే తన తండ్రి బయోపిక్‌లో నటించాలని అనుకోవడం లేదని చెప్పారు.

రాజమౌళితో రామ్ చరణ్
ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. జులై 31న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











