RC 15పై స్పందించిన చరణ్..వారి జీవితం ఆధారంగానే సినిమా.. పాత్ర ఏమిటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పూర్తిస్థాయి ఫామ్ లో ఉన్నారు. వినయ విధేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ ఎన్టీఆర్ కంటే నటన విషయంలో రామ్ చరణ్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆయన నటించిన ఆచార్య సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఆయన మరో పక్క శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం మీద ఆయన లీక్స్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

RRR
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించిన RRR సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించి అలరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. ఇక డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 1100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలబడింది.

ఆచార్య
ఈ తర్వాత రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఆచార్య సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమాలో మెగాస్టార్ హీరోగా నటించగా ఆయన శిష్యుడు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ - కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ల మీద నవీన్ రెడ్డి అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు..

రాజు భారీ బడ్జెట్ తో
ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న రామ్ చరణ్ తేజ తాను నటించబోయే తర్వాత సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నారు ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు భారీ షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యాయి. మొదటి షెడ్యూల్ షూటింగ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండో షెడ్యూల్ షూటింగ్ పంజాబ్ లోని అమృత్సర్ లో పూర్తయింది.

వారి జీవితాన్ని ఆధారంగా
ఇక ఈ సినిమా స్టోరీ గురించి చెబుతూ ఈ సినిమా ఎవరైతే ఆఫీసర్లు మన సమాజానికి ఇన్స్పిరేషన్ గా నిలిచారో? మన జాతి నిర్మాణానికి రోల్ మోడల్ గా నిలిచారో? వారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నామని అన్నారు. అంతేకాక ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామా అని చెబుతున్నారు. యాంటీ కరప్షన్ అనే అంశం మీద సినిమాని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

సాధారణ పౌరుడి పాత్ర
ఇందులో రామ్ చరణ్ తేజ్ పాత్ర అవినీతి అరికట్టాలి పోరాడే ఒక సాధారణ పౌరుడి పాత్రగా ఉండబోతోందని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











