సిలికాన్ వ్యాలీలో రామ్ చరణ్ ‘ఆరెంజ్’ విజయోత్సవాలు...!
ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకేసారి రమ్మను అంటూ మగధీరుడిలా సవాల్ చేసిన మరీ తన దమ్ము చూపించిన రామ్ చరణ్ తన తాజా చిత్రం 'ఆరెంజ్"లోనూ ఒక రేంజ్ ఫైట్ చేస్తున్నాడు. అయితే మగధీరలో నింగి కి పాతాళానికి మధ్య నిల్చొని శత్రువులను చీల్చిచెండాడిన చరణ్ ఈసారి సముద్రపు లోతుల్లో సమరం సాగించనున్నాడని సమాచారం. ఆరెంజ్ అనేది లవ్ స్టోరి అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ కోసం కథలో మాస్ ఫైట్స్ ని చేయటం జరిగిందనిదర్శకుడు భాస్కర్ చెప్పుకొచ్చాడు. ఒక ప్రక్క ఆరెంజ్ ఆడియో హిట్ సందడి మరోపక్క విడుదలకు సన్నాహాలు ఉపందుకొంటున్నాయి..
కాగా లవర్ బోయ్ గా రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తున్న ఈ కొత్త ట్రెండ్ చిత్రం 'ఆరెంజ్" ఆడియో విజయోత్సవాలు సిలికాన్ వ్యాలీలో ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని సన్నివేల్ టెంపుల్ లో బే ఏరియా తెలుగు అసోసియేషన్ దీపావళి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిపారు. ప్రముఖ ఫ్రీలాన్స్ వ్యాఖ్యాత ఇషికారాపు సక్సెస్ హీట్ ను ఉత్సాహభరితంగా నడిపారు. సుప్రీం ఆడియో కంపెనీ నిర్వహించిన ఈ విజయోత్సవ కార్యక్రమానికి సుప్రీం కంపెనీ ప్రతినిధి హరి గక్కని సమన్యయకర్తగా వ్యవహరించగా తానా అధ్యక్షులు జయరాం కోమటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











