‘చిరు’ కెరీర్ కి ‘ఠాగూర్’ బ్లాక్ బస్టర్ అయితే రామ్ చరణ్ కి ‘ఆరంజ్’ బ్లాక్ బస్టర్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆరంజ్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ నాగబాబు ఆంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న, హారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో రైట్స్ ఊహించని పెద్ద మొత్తానికి సోనియా మ్యూజిక్ వారితో పోటీపడి ఆదిత్య మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు.
అలాగే ఈ చిత్రానికి పెట్టిన ఓ రేంజ్ లవ్‌స్టోరీ అనే ట్యాగ్‌లైన్ ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో ప్రతి విషయంలోనూ (హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, స్టైలింగ్) రామ్‌చరణ్ కొత్తగా న్యూ స్టైల్‌లో కనపడేలా జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు తాను నటించిన రెండు చిత్రాల్లోనూ ఒకే కథానాయికతో నటించిన రామ్ చరణ్ మొదటి సారిగా జెనీలియా, షాజహాన్ పదమ్సీ, సంచిత శెట్టి వంటి పలువురు హీరోయిన్ లతో నటిస్తుండడం విశేషం.
రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ తాజా చిత్రం 'ఆరంజ్" ఆడియోను మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని 'ఆగష్టు 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ గత చిత్రం 'స్టాలిన్" ఆడియోను ఇదే తారీఖున విడుదల చేశారు. చిరంజీవి కెరీర్ లో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ మూవీ 'ఠాగూర్" చిత్ర ఆడియోను కూడా ఇదే తేదిన విడుదల చేశారు. ఆ రెండు చిత్రాల ఆడియోతో పాటు సినిమాలు కూడా విజయం సాధించాయి. అదే సెంటిమెంట్ తో 'ఆరెంజ్" ఆడియోను ఆరోజునే విడుదల చేయనున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











