బాబాయ్ తొలిప్రేమను ఫాలో అవుతున్న రామ్ చరణ్ అరెంజ్
బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి ప్రేమను రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ ఫాలో అవుతుందనే ప్రచారం టాలీవుడ్ లో గుప్పుమంటోంది. తొలి ప్రేమ సినిమా ప్రేమ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రేమ కథాంశంగా నిర్మించిన సినిమానే అయినా ఇందులో డ్యూయెట్స్ లేవు. హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్స్ లేకపోవడం తొలి ప్రేమలోని కొత్తదనం. అదే పద్ధతిని ఆరెంజ్ సినిమాలో ఫాలో అవుతున్నారట. మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ చేస్తున్న సినిమా ఆరెంజ్. ఇప్పటికే రామ్ చరణ్ స్టిల్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన ఆ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరుగనుంది. సినిమా నవంబర్ లో విడుదలవుతుందని అంచనా. ఈ సినిమాకు నాగబాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. జెనీలియా, షాజనా పదామ్సి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











