జూ ఎన్టీఆర్ తర్వత రామ్ చరణ్ హంగామా...
చిరుత, పులి లాంటి మాస్ పాత్రతో పరిచయమై శతధ్రువ వంశ యోధునిగా హై ఎనర్జిటిక్ పాత్రలో నటించి, మెప్పించిన రామ్ చరణ్ తేజ్..తాజాగా లవర్ బాయ్ గా రాబోతున్నారు. 'ఆరంజ్" పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో చరణ్ సరసన జెనీలియా, షాజన్ పదంసి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'బొమ్మరిల్లు", 'పరుగు" చిత్రాల తర్వాత దర్శకుడు భాస్కర్ చేస్తున్న సినిమా ఇదే. అంజనా ప్రొడక్షన్స్ పతాకం పై కె నాగేంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. చరణ్ మరికొంతమంది తారలు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఆ తర్వాత ఆస్ట్రేలియాలో మూడు పాటలు, యాక్షన్ ఎపిసోడ్ ను తీస్తారు. యాక్షన్ ఎపిసోడ్ ను హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో చిత్రీకరించడానికి అవసరమైన ఏర్సాట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా షెడ్యూల్ తో 'ఆరంజ్" చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ నెలలోనే ఆడియో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు.
ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం ఇప్పటికే సిడ్నీ, పరిసరాల్లో చిత్రీకరణ జరిపారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని మలుస్తున్నామని నిర్మాత చెబుతున్నారు. డా బ్రహ్మానందం, ప్రభు, సుమన్, ప్రగతి, కిషోరు తదితరులు నటిస్తున్నారు.
కాగా టాలీవుడ్ లో మెయిన్ స్టార్స్ పవన్, రజనీ, మహేష్, ల సినిమాల హవా అయిపోయింది. మరి ఇక జూ ఎన్టీఆర్ 'బృందావనం', రామ్ చరణ్, 'ఆరంజ్', అల్లు అర్జున్ 'బద్రీనాథ్' లో క్యూలో వున్నాయి...


Click it and Unblock the Notifications











