రామ్ చరణ్ ఆరెంజ్ సప్సెన్షన్...అభిమానుల్లో పెరుగుతున్నాటెన్షన్..!
రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ విడుదల విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. వీలయినంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయాలని రూపకర్తలు ఎంత ప్రయత్నిస్తున్నా కానీ పనుల్లో ఆలస్యం జరుగుతూనే ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలకి సమయం ఊహించిన దానికంటే ఎక్కువ పడుతుండడం వల్ల ఆరెంజ్ రిలీజ్ వచ్చే వారంలో ఉండదని సమాచారమందింది. నవంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నా అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే లాస్ట్ మినిట్ ప్రాబ్లెమ్స్ వచ్చే సమస్య ఉంటుంది కాబట్టి, దానిని అవాయిడ్ చేయడానికి ఆరెంజ్ రిలీజ్ ఒక వారం వాయిదా పడొచ్చునని అంటున్నారు.
అంటే నవంబర్ 26కి మరియు డిసెంబర్ 3కి ఆరెంజ్ పోస్ట్ పోన్ అవుతుందనేది తాజా సమాచారం. అయితే ఇంతదాకా ఈ చిత్రం విడుదల గురించి ఈ చిత్రానికి సంబంధించిన వారెవరూ అధికారికంగా ప్రకటించలేదు. నవంబర్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నామని అంటున్నారే తప్ప ఫలానా తేదీ అని తేల్చి చెప్పలేదు. సినిమాలకి అనుకూలం కాదనే నవంబర్ నెలలో ఆరెంజ్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడం, అదీ దీపాళి వీక్ మిస్ అయి చలి ముదురుతున్న సమయానికి చిత్రాన్ని వాయిదా వేయడం అభిమానులకి మాత్రం రుచించడం లేదు. అన్ని అననుకూలతలను అధిగమించి ఆరెంజ్ ఏ రేంజ్ సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరమైంది.


Click it and Unblock the Notifications











