నెగిటివ్ టాక్ తో రామ్ చరణ్ 'ఆరెంజ్' ది మార్చారు
రామ్ చరణ్ ఆరెంజ్ లోగో పై అన్ని చోట్ల నుంచి నెగిటివ్ టాక్ రావటంతో దాన్ని మార్చారు. అందులోనూ బి,సి సెంటర్లలో ఈ చిత్రం లోగో చూసి అర్దం కావటంలేదని కంప్లైంట్ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాత నాగబాబు చెప్తున్నారు. లోగో బ్యాక్ గ్రౌండ్ కలర్స్ ని ఛేంజ్ చేసి ఆరెంజ్ అనే అక్షరాలు క్లియర్ గా కనపడేటట్లు ఈ కొత్త లోగోని తీర్చిదిద్దారు. ఇక ఈ చిత్రం నవంబర్ 19 న విడుదల అవనుంది.
మగధీర ఘన విజయం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావటంతో మంచి క్రేజ్ వస్తోంది. ఈ చిత్రం ఓ రేంజి లవ్ స్టోరీగా అభివర్ణిస్తున్న ఈ చిత్రానికి హారీస్ జైరాజ్ అందించిన పాటలు ఇప్పటికే మార్కెట్లో అదరకొడుతున్నాయి. ఇక ఈ చిత్రంలో జెనీలియా మెయిన్ హీరోయన్ గానూ, ఆమెతో పాటు షాజన్ పదమ్ సీ, సంచితా షెట్టి లీడ్ రోల్స్ చేస్తున్నారు. షాజన్ పదమ్ సీ ఈ చిత్రంలో టీనేజ్ అమ్మాయిగా, ఫ్రెష్‌గా కనిపిస్తాను అని చెప్తోంది. సినిమా సెకెండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆమె పాత్ర వస్తుంది.


Click it and Unblock the Notifications











