రామ్ చరణ్ ‘ఆరంజ్’ నెక్ట్స్ షెడ్యూల్ 21 నుండి ముంబాయ్ లో!
అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు నాగబాబు నిర్మిస్తున్న ఆరంజ్ చిత్రం ఈ నెల 21 నుండి ముంబాయ్ లో షూటింగ్ జరగనుంది. బాలివుడ్ బ్యూటి షాజన్, హీరో రామ్ చరణ్ లకి సంబంధించిన పలు సన్నివేశాలు తీసేందుకు దర్శకుడు భాస్కర్ సమాయుత్తమవుతున్నారు. మే 31 వరకు జరగనున్న ఈ షూటింగ్ కి సంబందించిన ఏర్సాట్లు పర్యవేక్షించేందుకు ఇప్పటికే నిర్మాత నాగబాబు ముంబాయ్ వెళ్లారు.
గతంలో బొమ్మరిల్లు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ని, పరుగు చిత్రానికి మణిశర్మని సంగీత దర్శకులుగా తీసుకున్న దర్శకుడు భాస్కర్ తన మూడో చిత్రమైన ఆరంజ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా హరీస్ జైరాజ్ ని తీసుకున్నాడు. చిత్రంలోని అన్ని పాటలు హరీష్ అద్బుతంగా తీర్చిదిద్దాడని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. కెమేరామెన్ కిరణ్ రెడ్డి నేతత్వంలో చిత్రం అత్యద్బుతంగా అందంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ్ బొమ్మరిల్లు భాస్కర్ ఆరంజ్ ముంబై జెనీలియా మణిశర్మ దేవిశ్రీ ప్రసాద్ ram charan teja bommarillu bhaskar orange mumbai genelia mani sharma devisri prasad


Click it and Unblock the Notifications