రామ్ చరణ్ 'ఆరెంజ్' రిలీజ్ ఎప్పుడంటే....
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆరెంజ్'..ఆ రేంజే వేరు చిత్రం అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొన్నే రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుని ఇండియా వచ్చిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయన్ గా చేస్తోంది. ఆమెతో పాటు షజాన్ పదమ్సి(Shazahn Padamsee), సంచితా షెట్టి లీడ్ రోల్స్ చేస్తున్నారు. నాగేంద్రబాబు తన అంజనా ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కె.వెంకట్రావు సమర్పించే ఈ చిత్రం దసరా కానుకగా పండగ రోజులు కలిసి వచ్చేటట్లు ఉండాలని నిర్ణయించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ తాజాగ ధరణి దర్శకత్వంలో 'మెరుపు' అనే చిత్రం చేయటానికి కమిట్ అయ్యారు.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ్ మగధీర భాస్కర్ జెనీలియా ఆరెంజ్ కాజల్ మెరుపు ram charan teja magadheera bhaskar genelia orange


Click it and Unblock the Notifications











