ఎట్టకేళకు ఖరారైన రామ్ చరణ్ ఆరంజ్ రిలీజ్ డేట్...!?
'ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్...అందరినీ ఒకేసారి పంపించు" అంటూ శతధ్రువవంశ యోధునిగా చరణ్ చేసిన విజయగర్జన తాలూకు వేడి ఇంకా చల్లారలేదు. అప్పుడే మరో సంచలనానికి సిద్ధమయ్యారు రామ్ చరణ్. 'బొమ్మరిల్లు" దర్శకుడు భాస్కర్ నిర్దేశకత్వంలో జెనీలియా నాయికగా ఆయన నటించిన 'ఆరెంజ్" చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మగధీర" తర్వాత రానున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా చిరంజీవి సోదరుడు నాగబాబు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటివరకూ చరణ్ చేసిన రెండు చిత్రాలకు పూర్తిభిన్నంగా 'లవర్ బోయ్"గా చరణ్‌ని చూపించనున్నారు దర్శకుడు భాస్కర్. ఈ సినిమా గురించి నాగబాబు మాట్లాడుతూ -'ఇందులో భయానకమైన బాంబ్ బ్లాస్టింగ్స్ ఉండవు. రోమాలు నిక్కబొడుచుకునే డైలాగులు కూడా ఉండవు. సుమోలు ఆకాశంలో ఎగరడం కూడా ఈ సినిమాలో కనిపించవు. ఈ సినిమాలో ఉండేది - ప్రేమ తాలూకు భావోద్వేగాలు, గిలిగింతలు, మరపురాని అనుభూతిని పంచే సన్నివేశాలు మాత్రమే అన్నారు. మరి అవేంటో తెరపైన చూసి తరించాల్సిందే..


Click it and Unblock the Notifications











