హృదయాన్ని ఎంతమందికైనా పంచవచ్చనే కథతో "ఆరెంజ్" (ప్రివ్యూ)
అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో రూపొందిన "ఆరెంజ్" చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ చిత్రం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నేపథ్యంలో జరుగుతూంటుంది.కథలో రామ్ (రామ్‌చరణ్) ఓ ఆర్టిస్టు(చిత్రకారుడు). సిడ్నీలో గోడల మీద బొమ్మలు వేయడం అతని వృత్తి. అతనికి ప్రేమ మీద కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలుంటాయి. హృదయమనేది ఎంత మందికైనా పంచివ్వొచ్చు అని వాదిస్తుంటాడు. ఒకరి కోసం ఒకరు అనుకోవడంలో నిజమైన ప్రేమ లేదంటాడు. జానకి (జెనీలియా) సిడ్నీలో ఉండి చదువుకొంటుంది. జానికివి విరుధ్దమైన భావాలు.
ఒక మనస్సు ఒకరికే సొంతం అనే ఆలోచనలతో ఉంటూంటుంది. ఇలా విరుద్దమైన భావాల కల రామ్, జానకిలలు ఎలా ఒక్కటయ్యారు అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇక ఈ చిత్రం విజయంపై నిర్మాత నాగబాబు బాగా నమ్మకంగా ఉన్నారు. అలాగే ఇఫ్పటికే హారిస్ జైరాజ్ అందించిన పాటలు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. వీటిన్నటికన్నా రామ్ చరణ్..చిత్ర కథలో భాగంగా చేసిన స్కై డైవ్ అందర్నీ ఆకట్టుకుంటుందంటున్నారు. పరుగు తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఈ చిత్రం క్లాస్ ఆడియన్స్ కి బాగా పట్టే అవకాసముందని చెప్తున్నారు. రామ్ చరణ్ రెగ్యులర్ మాస్ ఆడియన్స్, భాస్కర్ క్లాస్ ఆడియన్స్ కలిసి ఈ ఆరెంజ్ ని ఏ రేంజికి తీసుకు వెళ్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











