జాక్ పాట్ కొట్టనున్న రామ్ చరణ్ ఆరెంజ్ కు అక్కడే 10 కోట్లు....
రామ్ చరణ్ హీరోగా'బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మిస్తున్న 'ఆరెంజ్" చిత్రం తెలంగాణ ప్రాంతం పంపినీ హక్కులు 10కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సినిమా ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇదిలా ఉంటే రంగా రెడ్డి ప్రాంతం కోసం ఓ పంపిణీదారుడు ఇంతే మొత్తం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడట. రాయలసీమ ప్రాంతం హక్కులు 7 కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ బంగీ జంప్ చేయడం, భాస్కర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు పొందడం వల్ల పంపిణీ హక్కులు ఇంత క్రేజీగా అమ్ముడుపోయాయని పరిశీలకులు అంటున్నారు.
రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ నాగబాబు ram charan teja orange genelia bommarillu bhaskar nagababu


Click it and Unblock the Notifications