రామ్ చరణ్ ‘ఆరంజ్’ టైం అయిపోయిందోచ్చ్..!?
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వస్తున్న 'ఆరంజ్" సినిమా టైం అయిపోయింది. ఏ సినిమాకు పేరు పెట్టాలన్నా ముందుగా ఫిలించాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది. కొత్త టైటిల్ రిజిస్ట్రేషన్ గడువు యేడాది వరకే ఉంటుంది. దాంతో ఫిలింఛాంబర్ విడుదల చేసిన జూలై నెల జర్నల్ లో 13వ పేజిలో చాలా స్పష్టంగా ఆగస్టు 2010 లో గడువు పూర్తవుతున్నటైటిల్ ను ప్రకటించారు. అందులో రామ్ చరణ్ తేజ సినిమా 'ఆరంజ్" కూడా ఉంది.
ఆగస్టులో ఈ టైటిల్ రెన్యూవల్ చేయించుకోకపోతే సదరు టైటిల్ ను వేరే వాళ్లకు ఇచ్చే అధికారం ఫిలింఛాంబర్ కు ఉంది. సో ఆగస్టులో టైమ్ అయిపోతున్న ఆరంజ్ ను తిరిగి రెన్యూవల్ చేసుకుంటారో లేదో చూద్దాం. ఆరంజ్ వరుసలోనే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ టైటిల్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్", గుడుంబా శంకర్ దర్శకుడు వీరశంకర్ సిల్వర్ స్ర్కీన్ బ్యానర్ లో 'యువరాజ్యం" ఇంకా పలు సంస్థలు కూడా ఉన్నాయి. మరైతే ఆగస్టులోపు ఈ టైటిల్స్ ను రెన్యూవల్ చేయించుకుంటేనే ఆయా సంస్థలకు దక్కుతాయి.


Click it and Unblock the Notifications











