బ్రిటిష్ మోడల్‌తో రామ్ చరణ్ సరసాలు పండేనా?

ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.
అసలే కత్తిలాంటి కుర్రోడు మన రామ్ చరణ్ తేజ. ఆవిడేమో పిటపిటలాడే బ్రిటిష్ మోడల్. ఇద్దరు కలిస్తే తెరపై హాట్ అండ్ స్పైసీ గా రొమాన్స్ పండటం ఖాయం అంటూ ఆ ఇద్దరిని కలల్లో ఊహించుకుంటున్నారు అభిమానులు. మరి తెరపై ఈ ఇద్దరి రొమాన్స్ ఏ రేంజ్ లో పండుతాయో సినిమా విడుదలైతేగానీ తెలీదు. ఏది ఏమైనా....ఎంతో మంది భామలకు లైఫ్ ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమ అమ్మీ జాక్స్‌న్‌కు ఇస్తుందని బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం.


Click it and Unblock the Notifications











