బాలీవుడ్ చిత్రంలో సత్తా చూపనున్న రామ్ చరణ్ తేజ్
రామ్ చరణ్ తేజ్ త్వరలో హఫీజ్ అనే టైటిల్ తో నిర్మాణమయ్యే బాలీవుడ్ చిత్రంలో కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు ముంబయి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఫర్హాన్ అక్తర్ ఈ మధ్య లేటెస్ట్ గా మగధీర చిత్రం చూసి తాను నిర్మించబోయే చిత్రంలో హీరోగా తీసుకోవటానికి నిర్ణయించుకున్నాడని చెప్తున్నారు. అయితే ఈ చిత్రం చూడమని రికమెండ్ చేసింది అభిషేక్ కపూర్ అనే యాడ్ ఫిలిం మేకర్. అతను ధీపికా పడుకోని తో కలిసి రామ్ చరణ్ తో ఈ మద్యన జోరున్న పెప్సీ అనే యాడ్ ఫిలిం తీసారు. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని ఈ విధంగా రామ్ చరణ్ ని బాలీవుడ్ లో ప్రమోట్ చేసాడని చెప్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ఓకే అయితే రామ్ చరణ్ సరసన దీపికాని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే చిత్రంలో చేస్తున్నాడు. అతని సరసన జెనీలియా చేస్తోంది.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ్ మగధీర జెనీలియా రాజమౌళి ఫర్హాన్ అక్తర్ హఫీజ్ అభిషేక్ కపూర్ ఆరెంజ్ ram charan teja magadheera genelia rajamouli hafeez abhishek kapoor orange


Click it and Unblock the Notifications











