ఫోటోలు : ఐస్ క్రీమ్ అమ్మిన చెర్రీ.. మంచు లక్ష్మి చేస్తున్న మంచి పనిలో భాగమైన మెగా పవర్ స్టార్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రం అందించిన విజయోత్సాహంతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇటీవలే చరణ్ షూట్ లో కూడా జాయిన్ అయ్యాడు. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్లకు పైగా కలెక్షన్లతో ఇప్పటికి రన్ అవుతోంది.
ఇదిలా ఉండగా రాంచరణ్ మేము సైతం ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంలో పలువురు స్టార్స్ భాగమవుతున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ మేము సైతం ఈవెంట్ లో పాల్గొని సారధి స్టూడియోలో సందడి చేసాడు. రాంచరణ్ చిన్నారులకు ఐస్ క్రీమ్ లు, సోడాలు విక్రయించాడు. రాంచరణ్ తో సెల్ఫీలు దిగేందుకు అక్కడ ఉన్న వారంతా ఆసక్తి చూపడం విశేషం.

మేము సైతం ప్రోగ్రాంలో రాంచరణ్ పాల్గొన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాసేపు రాంచరణ్ ప్రసంగించి అలరించాడు. ప్రస్తుతం బోయపాటి చిత్రంలో నటిస్తున్న చరణ్, ఆ తరువాత రాజమౌళి చిత్రంలో నటించాల్సి ఉంది.





Click it and Unblock the Notifications











