రూ. కోటి బహుమతి: చిరంజీవి కోసం రామ్ చరణ్ ఆరాటం!

By Bojja Kumar

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి పొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నచిరంజీవి తన 150వ సినిమాపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నారు.

ఇందులో భాగంగా 150వ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ పెంచే విధంగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే చాలా కథలు విన్న చిరంజీవి....మరింత బెస్ట్ స్టోరీ కావాలని కోరుకుంటున్నారు. చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడతో ఈచిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ చేపట్టబోతున్నాడు.

నాన్న ఇమేజ్‌కు సరిపోయే కథ అందిస్తే రూ. 1 కోటి బహుమతి ఇస్తానంటూ ఆఫర్ ప్రకటించాడట రామ్ చరణ్. రామ్ చరణ్ ఆఫర్‌ను ఎలాగైనా దక్కించుకోవడానికి పలువురు రచయితలు పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి చిరంజీవి 150వ సినిమాకు తగిన స్టోరీ అందించి ఆ పారితోషికం అందుకోబోయే రచయిత ఎవరు? అనేది వేచి చూడాలి.

దర్శకుడు ఎవరు?

దర్శకుడు ఎవరు?

చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ మధ్య వివి వినాయక్ పేరు ప్రముఖంగా వినిపంచింది. ఇటీవల బోయపాటి శ్రీను పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఫ్యాన్స్ హ్యాపీ

ఫ్యాన్స్ హ్యాపీ


చిరంజీవి 150వ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఓటమి పాలయ్యారనే బాధకంటే....ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

రామ్ చరణే నిర్మాత

రామ్ చరణే నిర్మాత


ఈ చిత్రాన్ని నిర్మించ బోయేది తానే అని గతంలో రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏవిషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

అన్ని అంశాలతో 150వ సినిమా

అన్ని అంశాలతో 150వ సినిమా


చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పుట్టిన రోజు కానుకా?

పుట్టిన రోజు కానుకా?


ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా కానకగా అందనుందని మెగాఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X