ఫ్యాన్స్ కి రామ్ చరణ్ పంపిన ఇన్విటేషన్ కార్డు ఇదే

ఆ కార్డులో ఏమి రాసి ఉందంటే..
"ప్రియమైన అబిమానులుకు ..
మీ రామ్ చరమ్ నమస్సుమాంజలి.
2012 జూన్ 14 వ తేదీన నా వివాహం ఉపాసనతో జరకుగుతోందన్న సంగతి మీకు తెలిసిందే. ..
అయితే భద్రతా కారణాల దృష్ట్యా మీ కోసం ప్రత్యేకించి
2013 జూన్ 15 వ తేదీ వివాహ రిసెప్షన్ నిర్వహిస్తున్నాము.
మీకు,నాన్నగారికీ ఉన్న అనుబంధం నాకు తెలుసు.
ఆయన కుమారడినైన నన్ను కూడా మీ ఆదరాభిమానాలతో
ఇంతటి వాణ్ణి చేసారు. అందుకే మీరంటే నాకు ప్రత్యేకమైన
ఇష్టం. జూన్ 15 వ తేదీ ఉదయం 11.15నిముషల నుంచి
హిమాయిత్ సాగర్ లో గల టెంపులు ట్రీస్ నందు
కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరిగే వివాహ రిసెప్షన్ కు
మీరు విచ్చేసి మీ శుభాసీస్లు అందచేస్తేనే ఈ శుభకార్యం సంపూర్ణం
అవుతుంది. కావున మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని
ఆశిస్తూ ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం
మీ రాకతో కళ్యాణ వేదిక కళకళలాడాలని ఆకాంక్షిస్తూ..."
మీ రామ్ చరణ్
ఇక రామ్ చరణ్ మేనమామ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఘనంగా వివాహ ప్రారంభ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు చలనచిత్ర పరిశ్రమలోని అతిరథులనదగ్గ వారందరూ విచ్చేసి రామ్‌చరణ్, ఉపాసనలకు
ఆశీస్సులందించారు.
అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, మోహన్‌బాబు, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, వెంకటేష్, మంచు విష్ణు, మంచు లక్ష్మీప్రసన్న, వీవీ వినాయక్, శ్రీనువైట్ల, బోయపాటి శ్రీను, సి.అశ్వనీదత్, సి.కళ్యాణ్, డీవీవీ దానయ్య, హరీష్‌శంకర్, బండ్ల గణేష్, చిన్నికృష్ణ, ఠాగూర్ మధు తదితరులు ఈ వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











