పైన పెద్ద ఎన్టీఆర్, కింద రాంచరణ్.. జూ.ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య సాన్నిహిత్యం రోజురోజుకు బలపడుతోంది. త్వరలో వీరిద్దరూ దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. వివిధ సందర్భాల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ, రాంచరణ్ ఫ్యామిలీ కలుసుకుంటున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య పరస్పర అభినందనలు చూస్తూనే ఉన్నాం.

తాజగా ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాంచరణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో చాలా విశేషం ఉంది. గోడపై సీనియర్ ఎన్టీఆర్ చిత్ర పటం ఉంది. ఆ కిందనే రాంచరణ్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. దాదాపుగా ఎన్టీఆర్ స్టైల్ లోనే రాంచరణ్ కూర్చుని ఉండడం విశేషం.
ఈ అందమైన దృశ్యాన్ని జూ. ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. లెజెండరీ ఆలోచనలు ప్రభావం చూపేలా అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. రాంచరణ్, ఎన్టీఆర్ నటించబోయే చిత్రాన్ని రాజమౌళి అక్టోబర్ నుంచి ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











