»   » రామ్ చరణ్-ఉపాసన హాలీడే ట్రిప్, శుభవార్త వినబోతున్నామా?

రామ్ చరణ్-ఉపాసన హాలీడే ట్రిప్, శుభవార్త వినబోతున్నామా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బ్రూస్ లీ' షూటింగులో రామ్ చరణ్ ఇంత కాలం ఎంత బిజీగా గడిపాడో అందరికీ తెలిసిందే. సూటింగ్ చివరి రోజుల్లో సమయాన్ని, నిద్రను లెక్క చేయకుండా శ్రమించాడు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడానికి రోజుకు 17 గంటల పాటు శ్రమించిన సందర్బాలు కూడా ఉన్నాయి. రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా సెట్లోనే గడిపేది.

వరుస షూటింగులతో అలసి పోయిన రామ్ చరణ్ రిలాక్స్ అవ్వడానికి లాండ్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఇటీవల ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘తాను మాత్రమే కాదు... ఉపాసన కూడా హాలీడే కోరుకుంటోంది' అని వెల్లడించారు. అయితే హాలిడే లోకేషన్ గా ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారనేది మాత్రం చరణ్ వెల్లడించలేదు.

Ram Charan planning long holiday along with his wife

ఈ హాలీవుడ్ అనంతరం రామ్ చరణ్-ఉపాసన దంపతుల నుండి శుభవార్త వినాలని మెగా కుటుంబ సభ్యులతో పాటు, మెగా అభిమానులు కూడా శుభవార్త వినాలని కోరుకుంటున్నారు. శుభవార్త అనగానే మీకు అర్థం అయ్యే ఉంటుంది. మరి రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆలోచన ఏమిటో ఇంకా వెల్లడి కాలేదు.

రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగిన అపపుడే మూడున్నరేళ్లు గడిచి పోయింది. త్వరలో తనకో మనవన్ని ఇవ్వాలని చిరంజీవి కూడా కోరుకుంటున్నట్లు సమాచారం. మెగా అభిమానులు కూడా చాలా కాలంగా శుభవార్త వినేందుకు ఎదురు చూస్తున్నారు. అందరి కోరిక త్వరలోనే నిజం కావాలని ఆశిద్దాం...

English summary
Speaking to a national media house, Charan said that he has been thinking about a long holiday along with his wife, who was equally tired as she too was present on the sets of Bruce Lee all through the shoot. "Not just me even my wife Upasana needs a holiday too," says Charan. However, Charan did not disclose the location of their holiday.
Please Wait while comments are loading...