మరోసారి రామ్ చరణ్ పోలీసాఫీసర్ అవతారం

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తెరపై పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' తర్వాత రామ్ చరణ్ సినిమా ఇంకా ఖరారు కానప్పటికీ....వచ్చే ఏడాది గౌతం మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఘర్షణ, ఏమాయ చేసావె, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాల ద్వారా గౌతం మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాస్తవికత ఉట్టిపడేలా, వైవిద్యంగా సినిమాలు తీయడం గౌతం మీనన్ స్టైల్. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ తమిళ సినిమా చేస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.

Ram Charan plays a cop role once again

తాజాగా ఈచిత్రానికి సంబంధించని కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ పోలీసాఫీసర్ గా నటిస్తాడట. అందుకే, ఇటీవల తన హెయిర్ స్టయిల్ ని ఈ హీరో అందుకు తగ్గట్టుగా మార్చుకున్నాడని అంటున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

రామ్ చరణ్ తర్వాతి సినిమాల విషయానికొస్తే... ఆయన ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. కథలు వింటున్నారు. శ్రీను వైట్లతో అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో ఆ ప్రాజెక్టు అటెక్కింది. మరో వైపు బోయపాటి స్టోరీ కూడా విన్నట్లు సమాచారం. త్వరలో బోయపాటితోగానీ, సుకుమార్‌తో గానీ సినిమా ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X