కాంగ్రెసుపై రామ్ చరణ్ సెటైర్
దేశంలో నడుస్తున్న కాంగ్రెసు గవర్నమెంట్ పై రామ్ చరణ్ ఓ సెటైర్ విసిరారు. ఆయన తాజాగా తన ట్విట్టర్ లో రాస్తూ... మన ఫైనాన్స్ మినిస్టర్ గారు GDP ఈ సంవత్సరం బాగా పెరుగుతుందంటున్నారు. దాని యాక్టువల్ అర్దం ఏమిటంటే... గ్యాస్, డీజిల్ మరియు పెట్రోలు అంటూ జిడిపి అక్షరాలను విడదీసి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో గ్యాస్, డీజిల్, పెట్రోలు బాగా పెరిగి సామాన్యుడిని ముఖ్యంగా మధ్య తరగతి వ్యక్తులను ఇబ్బందిపెడుతున్న నేపధ్యంలో రామ్ చరణ్ వేసిన ఈ పొలిటికల్ సెటైర్ బాగానే పేలింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తైంది. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ 'రచ్చ' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తోంది. అలాగే రీసెంట్ గా వినాయిక్ కాంబినేషలో ప్రారంభమయ్యే చిత్రం సైతం ఓపెన్ అయ్యింది. ఈ చిత్రం కామిడీతో కలిసిన యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











