రామ్ చరణ్, సానియా మీర్జా కలిసి....(ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్‌: రామ్ చరణ్, సానియా మీర్జా కలిసి అభిమానులుకు ఆనందాన్ని ఇచ్చారు. సికిద్రాబాద్‌ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళాశాల క్యాంపస్‌లో జరుగుతున్న సంబరాల్లో సినీనటుడు రాంచరణ్‌తేజ, ఉపాసన దంపతులు, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, పీవీ సింధు పాల్గొన్నారు.

మిలటరీ అధికారులతో కలిసి జెండావూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటుడు రాంచరణ్‌ మాట్లాడుతూ... దేశ రక్షణ కోసం సైనికులు అనేక త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు. వారి త్యాగాలు వెల కట్టలేమని, ఉత్తరాఖండ్ వరదల్లో సైన్యం వల్లనే పెద్ద యెత్తున భాధితులు రక్షింపబడ్డారన్నారు.

అలాగే రాంచరణ్‌ టెన్నిస్‌ రాకెట్‌ పట్టాడు. కోర్టులో బరిలోకి దిగి టెన్నిస్‌ ఆడాడు. సర్వ్‌లు, రిటర్న్‌లతో అలరించాడు. ఆదివారాన్ని రాంచరణ్‌ కాస్త ఆహ్లాదంగా గడిపాడు. భార్య ఉపాసనతో కలిసి మొయినాబాద్‌ సమీపంలోని సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీని సందర్శించాడు.

ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లో ఈఎంఈ వార్షిక క్రీడోత్సవాల్లో సానియా, రామ్‌చరణ్‌, ఉపాసన పాల్గొన్నారు. అట్నుంచి ఈ ముగ్గురు టెన్నిస్‌ అకాడమీకి వెళ్ళారు. అక్కడ సానియా, రాంచరణ్‌ కొద్దిసేపు టెన్నిస్‌ ఆడారు. అకాడమీ చాలా బాగుందని ఈ సందర్భంగా రాంచరణ్‌ కితాబిచ్చాడు.


ఆ ఫోటోలు మీ కోసం..స్లైడ్ షో లో...

రామ్ చరణ్..అబివాదం చేస్తూ

రామ్ చరణ్ కి తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. అక్కడ కూడా ఆయనకు త్వరలో అభిమానులు ఏర్పడబోతున్నారు. దాంతో నేషనల్ మీడియా కూడా రామ్ చరణ్ కార్యక్రమం అంటే ఎక్సక్లూజివ్ గా కవర్ చేయటానికి ఉత్సాహం చూపిస్తోంది.

సరదాగా ఓ ఫోటో

టెన్నిస్ తార సానియా మీర్జా అందరికీ ఆసక్తే...ఆమెతో మాట్లాడటం అందరికీ ఉత్సాహమే. అందుకేనేమో ఇలా రామ్ చరణ్, ఉపాసన కలిసి ఇలా ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. సానియాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనటం తమకి ఆనందమని తెలియచేసారు. సానియా కూడా ఈ జంటతో సరదాగా కబుర్లు చెప్పింది.

సానియా మీర్జా లుక్స్

సానియా మీర్జా.. భారత టెన్నిస్‌ క్రీడాకారుల సంఘం (ఐటీపీఏ)లో చేరింది. ఆమె ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది. పేస్‌, భూపతి, సోమ్‌దేవ్‌లు ఇప్పటికే ఐటీపీఏలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ''ఐటీపీఏ ఉపాధ్యక్షురాలిగా ఉండేందుకు సానియా మీర్జా అంగీకరించింది. ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు'' అని ఐటీపీఏ కార్యదర్శి, ఐటా ఉపాధ్యక్షుడు కార్తి చిదంబరం ట్వీట్‌ చేశాడు.

ముచ్చటైన జంట

రామ్ చరణ్, ఉపాసన ని చూసిన వారంతా వారు ఉత్సాహం,కబుర్లు చెప్పుకునే విధానం, ప్రతీ విషయం షేర్ చేసేకోవటం చూసి ముచ్చటైన జంటగా మాట్లాడుకున్నారు. తెలుగు మీడియా...ఈ జంటతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించింది. అయితే చరణ్ ఈ సందర్భంగా ..ఎక్కువగా సినిమాల గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు.

5కె రన్ లో పాల్గొంటూ...

రామ్ చరణ్ ...మిలటరీ అధికారులతో కలిసి 5 కె రన్ కు జెండావూపి ప్రారంభించారు. రామ్ చరణ్ ని అక్కడ తమతో పాటు చూసిన అక్కడ స్టాఫ్ చాలా ఆనందపడ్డారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగటం...ఆటో గ్రాఫ్ లు తీసుకోవటం జరిగింది. ఆయన మెగా స్టార్ తనయుడు అయినా చాలా సాదా సీదాగా అందరితో కలిసిపోయి మాట్లాడారు.

ఉపాసన ముచ్చట్లు...

రామ్ చరణ్ భార్యగా ఉపాసన సెలబ్రెటీ హోదాలో అక్కడ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె లుక్, పద్దతైన నడవిక చూసిన వాళ్లు ఆమెతో మాట్లాడటానికి ఉత్సాహం చూపించారు. ఉపాసన కూడా వారితో కలిసిపోయింది. అక్కడ ఉన్న కాసేపు చిరునవ్వుతో గడిపింది.

రన్..రన్ ..రన్

రన్ ..రామ్ చరణ్ ..రన్ అన్నట్లుగా రామ్ చరణ్ ఉత్సాహంగా ఈ 5కె రన్ లో పాల్గొన్నారు. ఆయన ఉత్సాహం మిగతా వారిలో కూడా ఆనందంగా రన్ లో పాల్గొనేలా చేసింది. అంతా కలిసి సరదాగా ఓ మంచి పని కోసం ఇలా రన్ చేయటం ..తమకు సంతోషమని చెప్పారు.

టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, మెగా పవర్ స్టార్ గా అభిమానులచే పిలవబడుతున్న రామ్ చరణ్ ఒకే చోట కలవటంతో అబిమానుల ఆనందానికి అంతేలేదు. అందులోనూ ఇలాంటి దేశభక్తి పూరిత కార్యక్రమాల్లో పాల్గొనటంతో తమ హీరో క్రేజ్ మరింత పెరిగినట్లు అయ్యిందంటున్నారు.

బహుమతి ప్రధానం..

సానియా మీర్జా చేతుల మీదుగా అవార్డు అందుకోవాలని చాలా మందికి ఉంటుంది. అక్కడ కొందరు చిన్నారలకు ఆ అదృష్టం దక్కింది. ఆమె చాలా సరదాగా జోవియల్ గా వారిని పలకరిస్తూ బహుమతి ప్రధానం చేసారు. సానియా చేతుల మీదుగా అందుకున్న చిన్నారుల ఆనందానికి అంతేలేదు. సానియా మీర్జా అక్కడ జరిగే ఉత్సవాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తోంది. ఆమె చూపులు...అక్కడ జరిగే కార్యక్రమాలపై ఉంటే...ఆమెపై మొత్తం మీడియా కళ్లు ఉన్నాయి. ఆమె ఎటు తిరిగా అటే మీడియా కెమెరా కళ్లు తిరగటం జరిగింది. అక్కడ ఆమె సెంటారాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.

టప్పట్లు కొడుతూ...

రామ్ చరణ్ ఇప్పుడు తెలుగులో ఓ రేంజి స్టార్ గా వెలుగుతున్నారు. ఆయన తాజా చిత్రం ఎవడు రిలీజ్ కు దగ్గరవుతోంది. అలాగే...ఆయన నటిస్తున్న హిందీ చిత్రం జంజీర్ తెలుగులో తుఫాన్ గా అలరించబోతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రానికి ఓ రేంజి బిజినెస్ జరిగిందని చెప్తున్నారు.

ఉపాసన, సానియా తో...

అటు రామ్ చరణ్ భార్య ఉపాసన, ఇటు సానియా మీర్జా..ఇద్దరూ ఒకే వేదికపై కలవటం మీడియాకు పండగే అనిపించింది. ఈ వాతావరణంలో అనేక సార్లు కెమెరాలు క్లిక్ మనిపించాయి. వీరిద్దరు కూడా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కొన్ని ముచ్చట్లు ముచ్చటించుకున్నారు.

భార్యతో రామ్ చరణ్ ...

ఫంక్షన్ లో ఇలా వీరిద్దరూ ఏదో విషయం గురించి చర్చించుకుంటూ కనపడటం జరిగింది. రామ్ చరణ్ వరస చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆమెకు సైతం చరణ్ అపాయింట్ మెంట్ దొరక్క ఇలా బయిటే మాట్లాడుకుంటున్నారు అని సరదాగా జోక్స్ కట్ చేసుకున్నారు.

వాక్ కు ఉపాసన సైతం...

ఉపాసన కూడా 5కె వాక్ లో పాల్గొన్నారు. ఆమె కూడా పాల్గొనటంతో అక్కడకి వచ్చిన మహిళలకు ఉత్తేజం వచ్చింది. చరణ్ భార్యగానే కాక అక్కడ ఆమెకు అపోలా వారి మనుమరాలిగా చాలా పరిచయాలు ఉన్నాయి. వారు పలకరించటం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X