సత్యదేవ్ నటనకు ఫిదా.. ప్రశసంలు కురిపించిన రామ్ చరణ్
ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాపై ఈ మధ్య కాలంలో వచ్చినన్ని ప్రశంసలు మరే చిత్రానికీ రాలేదు. వివాదాల్లో చిక్కుకున్నా, మీమ్స్‌లో అరటి పండు తాత రచ్చ చేసినా.. అంతా కూడా ఉమా మహేశ్వర మయమై అయింది. కథ, కథనాలు సహజత్వానికి దగ్గరగా ఉండటం, నటీనటుల ప్రతిభతో ఈ చిత్రం అందరి మదిలో చోటు దక్కించుకుంది. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను మాత్రమే కాదు.. స్టార్ హీరోలను కూడా కదిలించింది.
జూలై 30న ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మలయాళి సినిమా (మాహిషింతే ప్రతీకారమ్)కు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే మొదటగా ఈ చిత్రాన్ని వెండితెరపైనే విడుదల చేయాలని అంతా భావించారు. కానీ పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదని ఓటీటీని ఆశ్రయించారు. ఇక ఈ సినిమాను వీక్షించిన ప్రతీ ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యపై పొగడ్తల వర్షం కురిపించాడు.

రామ్ చరణ్ ఈ సినిమాపై స్పందిస్తూ.. 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఎంతో బాగా నచ్చింది. కథను నమ్మని చిత్రం ఎంతో గొప్పగా ఉంది. సత్యదేవ్, నరేష్, సుహాస్ నటన ఎంతో ఆకట్టుకుంది. హరి చందన, రూప కూడా చక్కగా నటించారు. ఈ చిత్ర యూనిట్ వీరి దగ్గరి నుంచి మంచి నటనను రాబట్టుకుంది' అంటూ ట్వీట్ చేశాడు. రామ్ చరణ్ ప్రశంసలకు ముగ్దుడైన సత్యదేవ్ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 'థ్యాంక్యూ సో మచ్ డియర్ రామ్ చరణ్ సర్. మీరు అన్న మాటలు మమ్మల్ని చెప్పలేని థ్రిల్‌కు గురి చేశాయ'ని సత్యదేవ్ తబ్బిబ్బైపోయాడు.


Click it and Unblock the Notifications











