రామ్ చరణ్ ‘జంజీర్’ప్రోమో సాంగ్ డిటేల్స్
ముంబై : రామ్ చరణ్ హిందీలో ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం 'జంజీర్'. అమితాబ్ సూపర్ హిట్ కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం ప్రోమో సాంగ్ షూట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా,రామ్ చరణ్ లపై స్పైసీగా ఈ సాంగ్ ని ప్రమోషన్ కోసం షూట్ చేసి భారీగా విడుదల చేస్తున్నారు. ఈ పాట గురించి దర్శకుడు అపూర్వ లఖియా మాట్లాడుతూ....జనవరిలో ఈ ప్రమోషన్ సాంగ్ షూట్ ఉంటుంది. అలాగే చిత్రం రీమేక్ గానీ ఈ ప్రమోషన్ సాంగ్ మాత్రం రీమిక్స్ మాత్రం కాదు అన్నారు. అలాగే జంజిర్ చిత్రం కథ గురించి మాట్లాడుతూ.. నిజాయతీపరుడైన పోలీసు అధికారికీ, చీకటి సామ్రాజ్యానికీ మధ్య సాగే యుద్ధంతో ఆ కథ నడుస్తుంది. ఏ కాలానికైనా తగిన కథ ఇది. చరణ్‌కి సరిపడే కథ అన్నారు.
జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్ ..విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా,తేజ గా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సోనూసూద్(తెలుగు వెర్షన్ కి),సంజయ్ దత్(హిందీ వెర్షన్ కి),మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
రామ్ చరణ్ జంజీర్ గురించి మాట్లాడుతూ..''ఈ సినిమా నాకో సవాల్. తప్పకుండా ఈ సినిమాతో అందరి అంచనాలను అందుకొంటాను. బిగ్‌బి పోషించిన పాత్ర నాకు దక్కడం సంతోషంగా ఉంది. నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. రామ్ చరణ్ బాలీవుడ్ కి కొత్త వాడు కావటంతో అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











