»   » పొలిటికల్ బ్రేక్-మళ్లీ మేకప్? దర్శకులకు ‘మెగా’ పిలుపు!

పొలిటికల్ బ్రేక్-మళ్లీ మేకప్? దర్శకులకు ‘మెగా’ పిలుపు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పరిస్థితులను ముందుగా అంచనా వేయడంలో చిరంజీవిని మించిన వారు మరెవరూ ఉండరేమో. గడిచిన పరిణామాలు పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. పీఆర్పీ టు కాంగ్రెస్ ప్రయాణమే ఇందుకు నిదర్శనం. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యం రాబోయేరోజుల్లో తనకు ఖాళీ సమయం మెండుగా దొరుకుతుందని భావిస్తున్న చిరంజీవి...ఎన్నికల ఫలితాలను బట్టి తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుంటే తాత్కాలికంగా రాజకీయాలకు బ్రేక్ వేసి సినిమాల్లో బిజీ అయిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ మేరకు ముందస్తుగా సిద్దమవుతున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం పూర్తవ్వగానే చిరంజీవి తన 150వ సినిమాకు సంబంధించిన చర్చల్లో మునిగిపోయారని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. తనతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్న వివి వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకులకు కబురు పంపినట్లు సమాచారం.

Ram Charan to produce Chiranjeevi's 150th film?

ఇప్పటికే కొన్ని కథలు సిద్దంగా ఉన్నప్పటికీ....150 సినిమా ప్రతిష్టాత్మకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వీలైనన్ని ఎక్కువ కథలు వినాలని నిర్ణయించుకున్నారట చిరంజీవి. ఆగస్టు నెల వరకు ఏదో ఒక కథను ఫైనలైజ్ చేసి సినిమా మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులు, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అభిమానులకు నచ్చే విధంగా కమర్షియల్ అంశాలు జోడించడంతో పాటు తన పొలిటికల్ కెరీర్‌కు ప్లస్సయ్యే విధంగా సందేశాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియజనున్నాయి.

English summary
There are rumours that actor-turned-politician Chiranjeevi is returning to finish his much-awaited 150th film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu