చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మాతగా...
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వెండితెరను పలకరించేందుకు సిద్దమవుతున్నారు. ఆయన హీరోగా నటించే చిత్రానికి కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా మారుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజే(ఆదివారం) రామ్ చరణ్ ప్రకటన చేయనున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా లియో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకులు గౌతం మీనన్, మురుగదాస్, త్రివిక్రమ్ లలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇంతకీ ఈ రోజు స్పెషల్ ఏమిటంటే...మెగాస్టార్ చిరంజీవి తన 55వ పుట్టిన రోజును ఈ రోజు(ఆగస్టు 22, ఆదివారం) జరుపుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకి చిరంజీవికి 150వ చిత్రం కావటం మరో విశేషం. అలాగే పుట్టినరోజుకి రామ్ చరణ్ చిరంజీవికి పెద్ద గిప్ట్ ఇవ్వబోతున్నారు. ఇందుకు నాలుగు కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ కారును ఆయన కొనుగోలు చేసినట్టు సమాచారం. అలాగే చిరంజీవికి...ధట్స్ తెలుగు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











