‘రచ్చ’ విడుదల తేదీ ప్రకటించిన నిర్మాత
మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'రచ్చ' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా ఉంటుందని, మెగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. వాన వాన రీమిక్స్ పాట సినిమాకు పత్ర్యేక ఆకర్షణ తెస్తుందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో రామ్ చరణ్, తమన్నాలపై పాట చిత్రీకణ జరుగుతోంది. రేపు(మార్చి 27) చరణ్ బర్త్ డే సందర్భంగా...ఒక రోజు ముందుగానే మీడియా సమావేశం సందర్భంగా రామ్ చరణ్ బర్త్ డే కేక్ కట్ చేశాడు. ఈ సమావేవంలో నిర్మాత ఎన్.వి. ప్రసాద్, దర్శకుడు సంపత్ నంది, రామ్ చరణ్ తేజ్, తమన్నా తదితరులు పాల్గొన్నారు.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.


Click it and Unblock the Notifications











