ఓ రేంజి ఎక్స్ పెక్టేషన్స్ తో రచ్చ చేస్తున్న రామ్ చరణ్..!?

By Sindhu

ఆరెంజ్ తర్వాత ఎన్నో కథలు విన్న రామ్ చరణ్ చివరకు సంపత్ నంది కథకి ఓకే చెప్పాడు. దర్శకుడు సంపత్ నంది తొలి సినిమా ఏమైందీ ఈవేళ చూసిన వాళ్లంతా అసలు రామ్ చరణ్ అతనిలో ఏం చూసి అవకాశమిచ్చాడని బహిరంగంగానే కామెంట్ చేశారు. అయితే తనేం చేస్తున్నదీ తనకి తెలుసన్నట్టు సంపత్ తోనే రచ్చ సినిమా మొదలు పెట్టాడు. రీమిక్స్ సాంగులు, భారీ ఫైట్లు వగైరా విశేషాలతో ఈ చిత్రం ఇటీవల న్యూస్ లో తరచుగా వినిపిస్తోంది.

అయితే అన్నిటికంటే ముఖ్యంగా రచ్చ మేకింగ్ వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఈ వీడియోలో చరణ్ రన్నింగ్ ట్రైయిన్ పై నుంచి మరో రన్నింగ్ ట్రైయిన్ మీదకి దూకి స్టయిల్ గా వాక్ చేసుకుంటూ వచ్చి నిలబడతాడు. రోస్ప్ సాయంతో చేసే ఫీటే అయినా కానీ జంప్ లో టైమింగ్, ల్యాండింగ్, తర్వాత నడకలో ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఆ మేకింగ్ వీడియోలో పర్ ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. చరణ్ ఏదో నిజంగానే రచ్చ చేయబోతున్నాడనే నమ్మకం ఈ వీడియో చూశాక అభిమానులకి ఏర్పడింది. ఫస్ట్ లుక్ స్టిల్స్, టీజర్స్ విడుదలయ్యాక ఖచ్చితంగా ఈ చిత్రం విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది.

రామ్ చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో పారస్ జైన్, ఎన్వీప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున చిత్రం రచ్చ త్వరలో ఈ చిత్ర బృందం చైనా కి వెళ్లనుంది. ఈ చిత్రంలో వచ్చే కొన్ని పోరాట సన్నీవేషాలని చిత్రికరించడానికి ఈ చిత్ర బృందం చైనా కి వెళ్లనుంది. చైనా లోనీ అటవీ ప్రాంతంలో ఈ సన్నివేశాలని చిత్రీకరిస్తారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X