‘రచ్చ’ ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో 'రచ్చ' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన తమన్నా నటిస్తోంది. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆరెంజ్ సినిమా తర్వాత రామ్ చరణ్ చాలా గ్యాప్ తీసుకున్న నేపథ్యంలో అభిమానులు ఈ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బయటకు రిలీజైన 'రచ్చ' సినిమా స్టిల్స్ అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక పోతే..'రచ్చ' ఆడియోను ఈ నెల 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలోగానీ, ఏప్రిల్ తొలి వారంలోగానీ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు. మొత్తం 5 పాటలను కంపోజ్ చేశారు. ఆడియో ట్రాక్ లిస్టు క్రింది విధంగా ఉంది.
ఆడియో ట్రాక్ లిస్టు వివరాలు
1) వాన వాన రీమిక్స్
2) రచ్చ టైటిల్ సాంగ్
3) దిల్లకు దిల్లకు
4) ఒక పదం
5) సింగరేణి ఉంది


Click it and Unblock the Notifications











