మహేష్ పక్కా ప్లాన్ కి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్...!
సినిమా ఇండస్ట్రీలో సాధ్యమైనంత వరకూ పెట్టిన డబ్బు ఎలా రాబాట్టాలా అని రకరకాలుగా బిజినెస్ ప్లాన్స్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు వంటి వాటితో ప్రేక్షకులకు సమాచారాన్ని అందిస్తుంటారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం సాద్యమైనంత త్వరగా ఓపెనింగ్స్ తోటే కలెక్షన్స్ రాబట్టడానికి ఎక్కువ థియేటర్లు, ఎక్కువ షోలు అని రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇవే కాకుండా దేశ నలుమూలల తమతమ హీరో అభిమానలు ఉంటారని తదితర భాషలు వారు ఉంటారనే ఉద్యేశంతో ఆ ప్రదేశాల్ని ఎంచుకొని మరీ సినిమాలు విడుదల చేయడం మొదలు పెట్టారు. అందుకు ఉదాహరణ అల్లు అర్జున్ కేరళలో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల తన సినిమాలను అక్కడ కూడా విడుదల చేయడం జరగుతుంది. అలాగే....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరీర్ లో దూసుకెళ్ళాలంటే మహేష్ బాబు దారిలో వెళితే బెటర్ అని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. అందుకే మహేష్ బాటలోనే కెరీర్ ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు హీరోలు ఇప్పటివరకు తమ మార్కెట్ ను తెలుగులోనే డెవలప్ చేసుకున్నారు తప్ప పక్క రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడలేదు. అయితే సూర్య, కార్తి లాంటి వారు ఇక్కడకు వచ్చి హిట్లు కొడుతుండటంతో మార్కెట్ స్ట్రాటజీ మనవాళ్ళు కూడా మార్చేసారు.
మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమాను తెలుగు తో పాటు తమిళ్, మలయాళంలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్ బిజినెస్ మ్యాన్ కు సంబంధించి మహేష్ డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు. ఆడియో రిలీజ్ కూడా తెలుగుతో పాటే మిగతా బాషల్లోనూ రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. డబ్బింగ్ వర్షన్ లా కాకుండా అన్ని బాషల్లోనూ బిజినెస్ మెన్ ఒకే సారి రిలీజ్ అవుతుంది. మహేష్ ప్లాన్ తో ఇంప్రెస్ అయిన రామ్ చరణ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు.
రామ్ చరణ్ తదుపరి చిత్రం రచ్చను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రచ్చ మాత్రమే కాదు…, వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేయబోయే సినిమా, వివి వినాయక్ డైరక్షన్ లో చేయబోయే సినిమా కూడా అన్ని సౌత్ లాంగ్వేజస్ లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











