రామ్ చరణ్ మిల్కీబ్యూటి తమన్నాల ఫారిన్ ట్రిఫ్...!
కొంత కాలం గ్యాప్ తర్వాత రామ్ చరణ్ తేజ నటిస్తున్న 'రచ్చ' సినిమా షూటింగ్ మొదట్లో ప్రకటించినట్టు జూన్ ఒకటిన కాకుండా ఈ నెల 22 న హైదరాబాదులో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. పది రోజుల షూటింగ్ అనంతరం జూన్ 3 న యూనిట్ షూటింగ్ కోసం విదేశాలకు వెళుతుంది. 'ఏమైంది ఈ వేళ' చిత్ర దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, సంగీతాన్ని డి.యస్.పి. కాకుండా మణిశర్మ చేస్తాడని తెలుస్తోంది. సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పారాస్ జైన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేస్తున్నారు. సమీరా రెడ్డి సినిమాటోగ్రఫి, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గాను పనిచేయనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా వరుసగా మెగా ఫ్యామిలీ స్టార్స్ తో చేయడమనేది గ్రేట్ ఇన్సిడెన్స్ భావిస్తున్నారు.
ram charan teja tamanna rachcha sampath nandi devisri prasad రామ్ చరణ్ తేజ్ తమన్నా రచ్చ సంపత్ నంది దేవిశ్రీ ప్రసాద్


Click it and Unblock the Notifications