రచ్చ చేస్తున్న రామ్ చరణ్ ఓ మార్కెట్ రౌడీ...!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం రచ్చ. సంపత్ నంది దర్సకత్వం లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే థాయ్ లాండ్, చైనా, బ్యాంగ్ కాక్, శ్రీ లంక లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం యూనిట్ ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చింది. నేటి నుండి ఫ్రెష్ షెడ్యూల్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
వంద శాతం మాస్ సినిమా, చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసుల వారికి నచ్చేట్టుగా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. మార్కెట్ రౌడీ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ కృషి చేస్తోంది. ఈ చిత్రానికి ఎన్వి ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు, సంగీతం: మణిశర్మ అందిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ సెలవులను వినియోగించుకోవాలనేదే ప్రొడ్యూసర్ల తాపత్రయం. రచ్చ ఎంత రచ్చను రేపుతుందో బాక్స్ ఆఫీసు వద్ద చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











