రచ్చలో చిరు ‘రెయిన్ సాంగ్’ కి స్టెప్పులేయనున్న చరణ్..!?
మెగాస్టార్ చిరంజీవిని బాగా గమనించిన వాళ్లు ఓ విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అదేంటంటే..చిరంజీవి ఏ సిట్యువేషన్ లో ఉన్నా తన ఎక్స్ ప్రెషన్స్ ని బయటకు తెలియకుండా గంభీరంగా ఉంటాడు. సేమ్ టు సేమ్ రామ్ చరణ్ కూడా ఇలాటే ఉండాని, ఈ క్వాలిటీ తన తండ్రి నుంచి పుణికి పుచ్చుకుందేనని పరిశీలకులు అంటున్నారు. అందుకేనేమో 'ఆరెంజ్' లాంటి ప్లాప్ చిత్రం తన దగ్గర నుంచి వచ్చినా చరణ్ పెద్దంతగా దీని గురించి ఫీలయి పోయి నీరసించి పోకుండా తదుపరి చిత్రం చేయడానికి ఉత్సాహంగా రెడీ అవుతున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించతలపెట్టిన చిత్రం 'రచ్చ'. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ కార్యక్రమాలు జూన్ 12 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా 'గ్యాంగ్ లీడర్' చిత్రం లోని 'వాన..వాన .. వెల్లువాయే...' సాంగ్ కు రామ్ చరణ్ స్టెప్పులు వేయనున్నాడని సమాచారం. ఆ మేరకు మణిశర్మ పాటను సిద్దం చేస్తునట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని షూటింగ్ కు సిద్దంగా ఉంది. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాను ఒకే ఒక షెడ్యూల్ లో పూర్తిచేయనున్నట్లు సమాచారం. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











