చరణ్ ‘రచ్చ’ అవుట్ అండ్ అవుట్ ఫెర్ ఫామెన్స్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ప్రారంభం కావడానికి ముహూర్తం ఖరారైంది. రామ్ చరణ్ తేజ్ నటించే 'రచ్చ' సినిమా షూటింగు జూన్ 1 న హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ తెలియజేశాడు. ఈ సినిమా కథ చాలా బాగా వచ్చిందనీ, మంచి షేప్ తీసుకుందనీ చరణ్ అంటున్నాడు. 'రచ్చ' అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అని చెప్పాడు. జూన్ ఫస్ట్ నుంచి కంటిన్యుస్ గా షూటింగ్ జరుగుతుందన్నాడు. 'ఏమైంది ఈవేళ' చిత్ర దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా అయిందట. 'ఆరెంజ్' సినిమా తర్వాత చాలా గ్యాప్ రావడంతో చరణ్ కూడా కొత్త సినిమా షూటింగ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు..!


Click it and Unblock the Notifications











