మే నెలకు వాయిదా పడిన రామ్ చరణ్ 'రచ్చ' .!?
ఆరెంజ్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించతలపెట్టిన చిత్రం 'రచ్చ'. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ కార్యక్రమాలు ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కావలసి ఉంది. కానీ సినిమా కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె కారణంగా మే నెలలో షూటింగ్ మొదలుపెట్టే విధంగా ప్రణాళికలో మార్పులు చేసుకున్నారు.
ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని షూటింగ్ కు సిద్దంగా ఉంది. సమ్మె ఆగిపోగానే ప్రారంభతేది తెలియజేస్తారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాను ఒకే ఒక షెడ్యూల్ లో పూర్తిచేయనున్నట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ రచ్చ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
ram charan teja rachcha sampath nandi devisri prasad రామ్ చరణ్ తేజ్ తమన్నా రచ్చ సంపత్ నంది దేవిశ్రీ ప్రసాద్


Click it and Unblock the Notifications