రామ్ చరణ్ అండ్ గ్యాంగ్ ఆర్ఎఫ్‌సి

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా ఏమైంది ఈ వేళ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం రచ్చ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ చరణ్, తమన్నాలపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. సంపత్ నంది ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ కలగలిపి రూపొందిస్తున్నారు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత చెర్రీ కెరియర్ లో ఇదో మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

మణిశర్మ ఈ చిత్రానికి మంచి ఊపుఉన్న సంగీతం సమకూరుస్తున్నారు. చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలోని 'వాన వాన వెల్లువాయె' పాటను కూడా రీమిక్స్ చేస్తున్నారు. అప్పట్లోనే ఈ వాన పాట ఆంధ్రదేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపింది. ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయే లెవల్లో మళ్లీ ఈ పాట తెలుగునాట మొత్తం రచ్చరచ్చ చేసే విధంగా చిత్రీకరిస్తున్నారు.

ఇక రచ్చ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి. ప్రసాద్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఈ చిత్రం 2012 మార్చిలో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X