»   » రిలాక్స్ అయిన రామ్ చరణ్...రచ్చ షూటింగ్ యథాతధం..!

రిలాక్స్ అయిన రామ్ చరణ్...రచ్చ షూటింగ్ యథాతధం..!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమా షూటింగ్ లో గాయపడ్డారని, ఉదయం రచ్చ సినిమా షూటింగులో జరిగిన ఈ ప్రమాదం పెద్ద కలకలం సృష్టించింది. గోవాలో రచ్చ సినిమాకు సంబంధించి ఫైట్స్ కోసం వేసిన ఓ భారీ సెట్టింగ్ లో రైల్వే ట్రాక్స్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు రోప్ తెగి పడటం వల్ల అలా జరిగిందని విశ్వసనీయవర్గాల నుండి అందిన సమాచారం. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రమాదం అంత పెద్దది కాదని, అలాగే అసలు రామ్ చరణ్ కి ఎటువంటి ప్రమాదం జరుగలేదని తెలిసింది. అంతే కాదు యథాతధంగా షూటింగ్ జరుగుతున్నట్టుగా లేటెస్ట్ సమాచారం. ఉడయం షైటింగ్ సీన్ చిత్రీకరణలో కారులో కూర్చొని ఉన్న రామ్ చరణ్ పైకి ట్రయిన్ దూసుకుని రావడంతో తీవ్రంగా గాయలనయ్యాయని, షూటింగ్ కూడా ఆగిపోయిందనే వార్తల్లో నిజంల ేలదని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.

  మీడియా కొద్దిగా అతి చేసి రచ్చ రచ్చ చేయడంతో గోవాలో తన కుమారుడికి ఏమయిందో...అని చిరు కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ఆందోళన చెందినట్టు మెగా సన్నిహితులనుండి అందిన సమాచరం. అయితే అక్కడ మీడియా సృష్టించినంత విషయం లేదని తెలుసుకుని చిరు కుటుంబ సభ్యులు అలాగే మెగా ఫ్యాన్స్ రిలాక్సయ్యారు. సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నప్పుడు హీరోలు గాయాల బారిన ప‌డ‌డం కొత్త విష‌య‌మేమీ కాక‌పోయిన‌ప్పటికీ ఇలా గాయాల బారిన ప‌డ‌కుండా మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత హీరోల‌పై, ఫైట్ మాస్టర్లపై, ద‌ర్శకుల‌పై ఉంటుంది కాబట్టి కాస్త ముందు జాగ్రత్త వహిస్తే కొంత వరకు ఇలాంటి ప్రమాదాలనుండి బయటపడవచ్చు..

  English summary
  Rachcha movie unit is presently in Goa, shooting for an action sequence and during this episode, Ram Charan Teja met with a freak accident. Charan was with few fighters in this scene and cables attached to a train snapped and it came roaring towards the car in which Charan was sitting.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more