డిసెంబర్ 10నుండి మళ్ళీ 'రచ్చ'లో రామ్ చరణ్...!
హైదరాబాదులో ఉపాసనా కామినేనితో గ్రాండ్ మేరేజ్ ఎంగేజ్ మెంటు, గోవాలో మిత్రులకు గ్రాండ్ పార్టీలతో గత నాలుగైదు రోజులుగా బిజీ బిజీగా బాగా ఎంజాయ్ చేసిన హీరో రామ్ చరణ్ తిరిగి షూటింగులో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'రచ్చ' సినిమా షూటింగు ఈ నెల 10 నుంచి తిరిగి మొదలవుతుంది. ఈ షెడ్యూలులో రామ్ చరణ్ పాల్గొనే చేజింగ్ దృశ్యాలను హైదరాబాదు సమీపంలోని వికారాబాదు అడవుల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతటితో ఈ సినిమా షూటింగ్ తొంభై శాతం పూర్తవుతుందని యూనిట్ వర్గాల నుండి అందిన సమాచారం.
ఇటీవల చైనాలో జరిగిన షూటింగులో రామ్ చరణ్, తమన్నాలపై రెండు పాటలను, రామ్ చరణ్, ఫైటర్లపై కొన్ని యాక్షన్ దృశ్యాలను షూట్ చేసిన సంగతి తెలిసిందే. సంపత్ నంది డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మెగాసూపర్ గుడ్ ఫిల్మింస్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రసాద్ మరియు పరాస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని మార్చి 2012లో మొదట వారంలో విడుదల చేయడానికి కోసం షూటింగ్ ని షరవేగంగా పూర్తి చేయనున్నారు.


Click it and Unblock the Notifications











