కసిగా ‘రచ్చ’ రచ్చ చేస్తున్న రామ్ చరణ్...?!
'ఆరెంజ్" చిత్రం నిరాశపరిచిన నేపథ్యంలో తాజాగా నటిస్తున్న 'రచ్చ"తో భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలన్న కసితో రామ్ చరణ్ ముందుకు సాగుతున్నాడు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకుడు. ఆర్‌బి చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై యన్‌వి ప్రసాద్, పారాస్ జైన్ జంటగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని వివిధ లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన వారు తమ అనుభవాలను పంచుకొంటున్నారు.
కాగా ఈ చిత్రం స్క్రిప్టు బాగా రావడం కోసం అధిక సమయం వెచ్చించారని, పరుచూరి బ్రదర్స్ తమ అనుభవాన్ని క్రోడీకరించి ఈ చిత్రానికి రచన చేస్తున్నారని రామ్ చరణ్ అంటున్నారు. ఎంతోమంది సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంలో పనిచేయడం ఆనందంగా ఉందని, పరుచూరి సోదరుల కాంబినేషన్ లో తనకిది తొలి చిత్రమని ఆయన అన్నారు. సినిమాలో క్యారెక్టరైజేషన్ బాగుంటుందని, చక్కటి కామెడీ కూడా ఉంటుందని చెప్పారు.
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ, 'ఏమైంది ఈ వేళ తర్వాత ఇంత మంచి అవకాశం రావడం ఆనందంగా ఉంది. స్క్రిప్టు మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను" అని పేర్కొనగా, రామ్ చరణ్ సరసన నటించడం పట్ల తమన్నా ఆనందాన్ని వ్యక్తంచేశారు.


Click it and Unblock the Notifications