బ్యాంకాక్ షెడ్యూల్లో బిజీగా ఉన్న చరణ్ రచ్చ..
చిరంజీవి తనయుడు రామ్ చరణ్, తమన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో..మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్ బి చౌదరి సమర్పణలో నిర్మాతలు పరాస్ జైన్, ఎన్ వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రచ్చ. గతంలో శ్రీలంకలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈనెల 15 వరకు అక్కడ షూటింగ్ జరుపుకుని అనంతరం చైనాలో మరో షెడ్యూల్ జరుపుకోనుంది.
చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ సంపత్ నంది కధ ఏ రేంజ్ లో చెప్పాడో అదే రేంజ్ లో తీస్తున్నాడు. చిత్రానికి మరో హై లైట్ పరుచూరి బ్రదర్స్ రచన. రచ్చ చిత్రం మెగా అభిమానుల అంచనాలని అందుకునే రీతిలో ఉంటుందన్నారు. చిరుతో పలు విజయవంతమైన చిత్రాలలో పనిచేసిన పరుచూరి బ్రదర్స్ ఇప్పుడు రామ్ చరణ్ ని మరో విభిన్న కోణంలో చూపించబోతున్నారని అన్నారు. రచ్చ చిత్రాన్ని ఈ సంవత్సరంలోనే విడుదల చేస్తాం అని తెలిపారు.


Click it and Unblock the Notifications











