రంగస్థలం మరో రికార్డు.. యూట్యూబ్‌లో ప్రభంజనం!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్ర సంచలనాలు ఆగడం లేదు. రాంచరణ్ ని ఊహించని విధంగా వెండి తెరపై ప్రజెంట్ చేసిన సుకుమార్ భారీ హిట్ కొట్టాడు. రాంచరణ్ నటన అభిమానులని సైతం అబ్బురపరిచింది. పల్లెటూరి యువకుడిగా వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ నట విశ్వరూపం ప్రదర్శించాడు.
కలెక్షన్ల పరంగా ఈ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులని నెలకొల్పింది. దాదాపు 120 కోట్లకుపైగా షేర్ వసూలు చేసి బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది. రాంచరణ్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ చిత్రం. ఈ చిత్రం మరో రికార్డుపై కూడా కన్నేసింది. ఈ చిత్రంలోని 'రంగంలోని మంగమ్మ' అనే సాంగ్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా దూసుకుపోతోంది.

రికార్డులు దాసోహం
రంగస్థలం చిత్రం ధాటికి అనేక రికార్డులు దాసోహమయ్యాయి. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన కథతో పాటు, రాంచరణ్, సమంత, ఆదిపినిశెట్టి నటనతో ఈ చిత్రం మరోస్థాయికి చేరింది. వసూళ్ల పరంగా అనేక రికార్డులు ఈ చిత్రానికి దాసోహమయ్యాయి.
మరో రికార్డుపై కన్ను
ఈ చిత్రం మరో రికార్డుపై కన్నేసింది. రంగమ్మ మంగమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ ఒక ఊపు ఊపింది. ఇటీవల ఈ వీడియో సాంగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెలరోజుల్లోనే ఈ సాంగ్ కు 40 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు వైపు దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఇంత వేగంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్న తెలుగు వీడియో సాంగ్ ఇదే.
బాహుబలి, ఫిదా సాంగ్స్
బాహుబలి చిత్రంలోని సాహోరే బాహుబలి వీడియో సాంగ్, ఫిదా చిత్రంలోని వచ్చిండే సాంగ్ దాదాపు 120 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. వీటిని యూట్యూబ్ లో వదిలి చాలా కాలమే అవుతోంది. రంగమ్మ మంగమ్మ సాంగ్ జోరు చూస్తుంటే త్వరలోనే ఈ రెండు సాంగ్స్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది.

దేవిశ్రీ మ్యాజిక్
సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ అదరగొట్టేశాయి. రంగస్థలం సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఎమ్ ఎమ్ మానసి పడిన రంగమ్మ మంగమ్మ సాంగ్ అందరిని ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











