Ram Charan-Ranveer Meesho Ad: పోయాం మోసం.. రామ్ చరణ్ - రణవీర్ బిగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సీక్రెట్ ఇదే!

రామ్ చరణ్ - దీపికా పదుకొణె - రణ్ వీర్ సింగ్ - త్రిష.. బిగ్గెస్ట్ సస్పెన్స్ సీక్రెట్ అంటూ ఇటీవలే రణ్ వీర్ సింగ్ ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ చేసింది. అందరి అభిమానుల మదిలో ఓ సస్పెన్స్ ను క్రియేట్ చేసింది. అయితే దాని విషయంలో చాలా మంది అనుకున్నట్టే జరిగింది. అదంతా ప్రమోషన్ యాడ్. దాని అసలు సీక్రెట్ ను తాజాగా రివీల్ చేశారు.

ఫ్యాషన్ ప్రియులకు ప్ర‌ముఖ ఆన్‌లైన్ సేల్స్ యాప్ మీషో గురించి తెలిసిందే. ఆ సంస్థ తమ డ్రెస్సింగ్ వేర్ ప్రొడక్ట్ ను.. సేల్స్ లో భాగంగా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తుంటుంది. అలానే ఇది కూడా చేసింది. ఆ వీడియో యాడ్స్‌ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ అండ్ షాక్ ఇచ్చింది. తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించగా హిందీలో ఇదే ప్రకటనలో ర‌ణ్‌వీర్ సింగ్ నటించారు.

Ram Charan-Ranveer Singh Meesho Ad

ఈ ప్రకటన ప్రారంభంలో.. 'సార్ టార్గెట్ ఫౌండ్' అని రామ్‌చ‌ర‌ణ్ అన‌గానే.. వేరే ప్ర‌దేశంలో వ్యాన్ లో ఉన్న మరో వ్య‌క్తి.. 'ఏజెంట్ అత‌ను ఏం వేసుకున్నాడు' అని అడుగుతాడు. అయితే అత‌డిని ఫాలో అవుతూ.. 'బ్లూ జీన్స్ బ్లాక్ జాకెట్.. జాకెట్ ప్రీమియంగా ఉంది. అత‌డికి బాగా సూట్ అయ్యింది. అబ్బాయి కొంచెం సెక్సీగా ఉన్నాడు సార్‌' అంటూ చ‌ర‌ణ్ కొంచెం సరదాగా సంభాషణను కొనసాగిస్తాడు. 'ఫోక‌స్ చేయ్ జీన్స్ గురించి చెప్ప‌మ‌ని అడగు' అని మళ్లీ మరోసారి వ్యాన్ లో ఉన్న వ్యక్తి అంటాడు.

వెంటనే చరణ్ తాను ఫాలో చేస్తున్న వ్యక్తిని డ్రెస్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటాడు. అత‌డిని ప‌ట్టుకుని 'ఎంత‌కు తీసుకున్నావ్ ఈ జాకెట్‌ను రూ.6వేలా' అని చరణ్ అడుగుతాడు. 'కాదు రూ.600 వంద‌ల‌కు' అని అత‌డు భయపడుతూ చెబుతాడు. 'ఎక్క‌డి నుంచి' అడగ‌గా 'మీ షో' నుంచి అని అతడు చెబుతాడు ఇలా యాడ్ చివరకు ముగిసింది. ఇక ఇదే ప్రకటనను హిందీలో రణ్ వీర్ సింగ్ చేశారు.

ఇక తమిళంలో త్రిష, హిందీలోనే దీపికా పదుకొణె చేసింది. కానీ హీరోయిన్లతో వేరే కాన్సెప్ట్ లో ఈ యాడ్ ను చిత్రీకరించారు. ఇక ఈ ప్రకటనను చూసిన నెటిజన్లు, అభిమానులు షాక్ అండ్ సర్ ప్రైజ్ అవుతున్నారు. 'ఇదేం యాడ్ రా బాబు' అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం 'బాగానే ఉంది సర్ ప్రైజ్' అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలను ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది 'మాకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు. ఇది ప్రమోషన్ స్టంట్' అని అంటున్నారు. మరి కొంతమంది సరదాగా 'పోయాం మోసం' అని కూడా కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X