RC 15 టైటిల్ ఫిక్స్ అయినట్లే.. అలా సెట్టయ్యేలా ప్లాన్ చేసిన శంకర్.. ఆ రోజే అఫీషియల్!

ప్రముఖ దర్శకుడు శంకర్ మొట్టమొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న చిత్రం RC 15 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకులు ముందుకు రావాల్సింది. కానీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం అయితే షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఇటీవల శంకర ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ టైటిల్ ను పోస్టర్ తో పాటు విడుదల చేయడానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మరో పాన్ ఇండియా సక్సెస్

మరో పాన్ ఇండియా సక్సెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత మళ్లీ అంతకుమించి అనేలా సోలోగా పాన్ ఇండియా సినిమాతో సక్సెస్ కొట్టాలని అనుకుంటున్నాడు. మధ్యలో ఆచార్య కాస్త నిరాశపరచినప్పటికీ కూడా ఆయన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే శంకర్ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఉంది.

భారీగా డిమాండ్

భారీగా డిమాండ్

దర్శకుడు శంకర్, కూడా రామ్ చరణ్ సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు కూడా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ స్థాయిలోనే ఖర్చు చేస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే సినిమాకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. కానీ దిల్ రాజు మాత్రం ఇంకా బిజినెస్ విషయాలలో అయితే ఫైనల్ డెసిషన్ ఏమి తీసుకోలేదట.

 ముందు అనుకున్న టైటిల్

ముందు అనుకున్న టైటిల్

ఇక RC 15 సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట సర్కారోడు అనే టైటిల్ అనుకున్నట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపించింది. సినిమా ఒక సోషల్ ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుందని ఇందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి గవర్నమెంట్ ప్రతినిధిగా ఉంటాడు కావున పర్ఫెక్ట్ టైటిల్ అదే అని కూడా ఒక ఒక టాక్ అయితే వినిపించింది.

మధ్యలో కూడా..

మధ్యలో కూడా..

ఇక RC 15 కు సంబంధించిన అనేక రకాల టైటిల్స్ చాలానే వైరల్ అయ్యాయి ఆ మధ్యలో సీఎం కామన్ మ్యాన్ అంటూ కూడా కొన్ని టైటిల్స్ వైరల్ అయ్యాయి. అదే విధంగా సిటిజన్ అనే టైటిల్ పేరు కూడా బాగానే వైరల్ అయింది. కానీ ఆ విషయంలో చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగా టైటిల్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ టైటిల్ ఫిక్స్?

ఈ టైటిల్ ఫిక్స్?

ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే సినిమాకు సంబంధించిన టైటిల్ దాదాపు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. కథకు సెట్ అయ్యే విధంగా దర్శకుడు శంకర్ సీఈవో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ ను ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా విడుదల చేయాలి అని ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ఎనౌన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మరి ఈ టైటిల్ జనాలను ఏ లెవెల్లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X