twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి ఇష్యూతో పాటు చాలా విషయాలపై మాట్లాడిన రామ్ చరణ్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Ram Charan Talks About Industry Culture

    'రంగస్థలం' సినిమా భారీ విజయం సాధించడం, రూ. 200 కోట్ల మార్కును సైతం అందుకోవడంతో బాలీవుడ్ క్రిటిక్స్ దృష్టి కూడా ఇటువైపు మళ్లింది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు రాజీవ్ మసంద్ చెర్రీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. రంగస్థలం సినిమా విశేషాలతో పాటు చరణ్ నెక్ట్స్ చేయబోయే రాజమౌళి మూవీ విషయాలు, చెర్రీ వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల టాలీవుడ్లో సెన్సేషన్ అయిన శ్రీరెడ్డి ఇష్యూను కూడా రాజీవ్ మసంద్ ప్రస్తావించారు. ఆయన అడిగిన ప్రశ్నలుక రామ్ చరణ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

    రంగస్థలం చాలా సంతోషాన్ని ఇచ్చింది

    రంగస్థలం చాలా సంతోషాన్ని ఇచ్చింది

    రంగస్థలం మూవీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో చిట్టి బాబు పాత్ర చేయడం వల్ల వ్యక్తిగతం కూడా నాలో మార్పు వచ్చిందని నా భార్యతో పాటు చాలా మంది చెబుతున్నారు. రంగస్థలం సినిమా సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ షూటింగ్ నిమిత్తం 5 రోజుల పాటు ఒక రిమోట్ విలేజ్‌లో పని చేశాం. అక్కడ ఎక్కువగా ఆదివాసీలు ఉన్నారు. వారిని దగ్గరగా గమనించడం వల్ల మరింత బాగా నటించగలిగాను.... అని రామ్ చరణ్ తెలిపారు.

     చేపలు పట్టే వ్యక్తి అలా చేయడం ఇన్ స్పైరింగ్ అనిపించింది

    చేపలు పట్టే వ్యక్తి అలా చేయడం ఇన్ స్పైరింగ్ అనిపించింది

    మేము షూటింగ్ చేస్తుంటే ఓ వ్యక్తి మమ్మల్ని అదే పనిగా చూడటం మొదలు పెట్టారు. నువ్వు ఏం చేస్తావు అని అడిగితే చేపలు పడతాను అన్నారు. నన్ను తీసుకెళతావా? అని అడిగితే తన బోటులో తీసుకెళ్లాడు. అతడు చేపలు పడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను. తెల్లవారు ఝామున ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే వెళ్లాను. అతడికి అనుకున్న దానికంటే ఎక్కువ చేపలే పడ్డాయి. కానీ తనకు ఎన్ని అవసరమో అన్ని మాత్రమే తీసుకుని మిగతా వాటిని నీటిలో వదిలేశాడు. అది నాకు ఎంతో ఇన్ స్పైరింగ్ అనిపించింది. నా క్యారెక్టర్ మరింత బిల్డ్ చేయడానికి ఇది మరింత సహాయపడింది. వారు గోదావరిని తల్లిగా కొలుస్తారు. నేచర్ పట్ల వారు ఎంత కేర్ గా ఉంటారో అర్థమైంది... అని రామ్ చరణ్ తెలిపారు.

    సినిమాల వైపు రావడానికి కారణం

    సినిమాల వైపు రావడానికి కారణం

    సినిమా రంగంలోకి, నటన వైపు రావడానికి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా ఓ కారణం. నా చిన్నతనంలో నాన్నగారు తన కోసం వచ్చిన అభిమానులకు బాల్కనీ నుండి హాయ్ చెప్పేవారు. అలాంటివి చూసీ చూసి నేను కూడా నాన్న లాగా సినిమాలు చేయాలి అని అనుకునేవాడిని. నేను యాక్టర్ కాకపోయి ఉంటే ఇక్కడ ఆకతాయిగా తిరిగే వాడిని అని రామ్ చరణ్ తెలిపారు.

    నా విషయంలో నాన్న ఫోకస్ అంతా దానిపైనే

    నా విషయంలో నాన్న ఫోకస్ అంతా దానిపైనే

    ఇన్నేళ్ల కాలంలో నాన్న గురించి నేను నేర్చుకుంది క్రమశిక్షణ మాత్రమే. నాన్నగారితో సినిమాల గురించి చర్చించడం తక్కువే. ఆయన ఎప్పుడూ నేను డిసిప్లిన్ గా ఉంటున్నానా? ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నాను? రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటున్నాను అని గమనిస్తూ ఉంటారు. రాత్రి 9.30 పడుకోవాలని చెబుతుంటారు. ఇటీవల ఆయన విహార యాత్రకు వెళ్లిన సమయంలో సెండాఫ్ ఇవ్వడానికి వెళితే కూడా సమయానికి పడుకో అని చెప్పి వెళ్లారు... అని రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

     రాజమౌళితో సినిమా గురించి

    రాజమౌళితో సినిమా గురించి

    రాజమౌళితో చేసయబోయే సినిమా గురించి బయటి ప్రపంచానికి ఎంత తెలుసో నాకూ అంతే తెలుసు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కథ వినలేదు. రాజమౌళి అద్భుతంగా సినిమాలు తీస్తారు. ఆ నమ్మకంతోనే బ్లైండ్‌‌గా ఓకే చెప్పాను. అయితే ఇది బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమా అయితే కాదనే విషయం మాత్రం చెప్పగలను. ఈ సినిమాలో నా లుక్ ఎలా ఉంటుందో? సినిమా ఎప్పుడూ అయిపోతుందో కూడా తెలియదు. ఎన్టీఆర్‌తో మంచి స్నేహం ఉంది. కనీసం మూడు నెలలకోసారైనా కలుస్తాం. ఇటీవల తారక్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్ కు కూడా వెళ్లాను. మా మధ్య మంచి స్నేహం ఉంది కాబట్టే మాతో మల్టీస్టారర్ చేస్తున్నారేమో. ప్రస్తుతం బోయపాటి సినిమాలో చేస్తున్నాను. దీని తర్వాత రాజమౌళి సినిమా... ఎప్పుడు అయిపోతుందో తెలియదు కాబట్టే ఇతర సినిమాలకు కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు అని రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

     బాబాయ్‌ని ఆ విషయంలో ఫాలో అవుతాను, పాలిటిక్స్ అయితే కాదు

    బాబాయ్‌ని ఆ విషయంలో ఫాలో అవుతాను, పాలిటిక్స్ అయితే కాదు

    బాబాయ రాజకీయాల్లో ఉన్నారు. నాకు ఆసక్తి లేదు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన పనిలేదు. నటుడిగా నన్ను నేను ఎలా చార్జ్ చేసుకోవాలనే విషయంలో బాబాయ్‌ని ఫాలో అవుతాను. ఏటా ఏదన్నా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. చైనా, లండన్‌ ఇలా ఎక్కడికైనా వెళ్లి నటన పరంగా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది. బాబాయ్‌ ఇలాంటివి చేసేవారు. ఆయన ఏడాదికి ఒక సినిమా చేస్తారు. ఆరునెలలు సినిమాకు కేటాయిస్తే. మరో ఆరు నెలలు తన కుటుంబంతో విహారయాత్రలకు వెళుతుంటారు. దీన్నే నేను కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నాను అని రామ్ చరణ్ తెలిపారు.

    శ్రీరెడ్డి ఇష్యూపై

    శ్రీరెడ్డి ఇష్యూపై

    హాలీవుడ్ పవర్ ఫుల్, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ హార్వీ వెయిన్‌స్టన్ సెక్సువల్‌గా నటీమణులను హరాస్‌చేస్తున్న బయట పడింది. ఈ కల్చర్, సెక్సిజం ప్రపంచమంతా ఉంది, అదే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉంది. ఈ విషయమై టాలీవుడ్లో శ్రీరెడ్డి కూడా ఆందోళన చేపట్టింది. మీ అంకుల్ పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్లు కూడా చేసింది దీనిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయమై రామ్ చరణ్ స్పందించారు. నేను ప్రత్యేకంగా ఆమె గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇలాంటివి అన్ని చోట్లా, అన్ని ఇండస్ట్రీల్లో ఉంటున్నాయి. పాలిటిక్స్, బిజినెస్‌లోకూడా చూశాం. ఇలాంటివి ఎవరూ ఎంకరేజ్ చేయ కూడదు. నా సిస్టర్స్ కూడా ఈ రంగంలో ఉన్నారు. ఇండస్ట్రీలో అంతా ఇలా ఉందని అనడం సరికాదు. కొంత వరకు ఇలాంటివి జరుగుతుండవచ్చు. దీనిపై ‘మా' కమిటీ వేసి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అదే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఇండస్ట్రీలో నా సిస్టర్స్ కూడా పని చేస్తున్నారు. ఇండస్ట్రీ సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను, తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలి అని రామ్ చరణ్ అన్నారు.

    English summary
    In Rajeev Masand Interview Telugu star Ram Charan talks about the success of his latest film Rangasthalam and how it’s liberated him to make the movies he believes in, his father - the legendary superstar Chiranjeevi - and what he’s learnt about career longevity from him, and that film he’s making with SS Rajamouli that also stars Jr NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X