twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్‌ని కదిలించిన మగధీర మానియా, ఊగిపోతున్న జపనీయులు.. థియేటర్స్ దద్దరిల్లేలా!

    |

    Recommended Video

    Ram Charan Reaction After Magadheera Gets Massive Response In Japan

    కొన్ని నెలల క్రితం రాజమౌళి బాహుబలి 2 చిత్రాన్ని ఎంజాయ్ చేసిన జపాన్ ప్రేక్షకులు ఇప్పుడు మగధీర మానియాతో ఊగిపోతున్నారు. పదేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ ప్రభంజనం అంటే ఏంటో తొలిసారి టాలీవడ్ బాక్స్ ఆఫీస్ కు రుచి చూపించింది. రాజమౌళి ఈ చిత్రాన్ని దృశ్యకావ్యంగా మలిచారు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి ఏర్పడిన క్రేజ్ ని ఉపయోగించుకునేందుకు మగధీర చిత్రాన్ని ఇటీవల జపనీస్ లోకి డబ్ చేసి విడుదల చేశారు.

    కలెక్షన్ల ప్రభంజనం

    కలెక్షన్ల ప్రభంజనం

    రాజమౌళి సినిమాలు అంటే యాక్షన్ ప్రియులకు పండగే. పోరాట సన్నివేశాలు ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ఉంటాయి. మగధీరలో కూడా అలాంటి సన్నివేశాలు ఉన్నాయి. బాహుబలి తరహాలోనే మగధీర చిత్రం కూడా జపాన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయినట్లు ఉంది. అందుకే అదిరిపోయే కలెక్షన్లు ఈ చిత్రానికి నమోదవుతున్నాయి.

    థియేటర్స్ దద్దరిల్లేలా

    జపాన్ థియేటర్స్ మొత్తం మగధీరం మానియా కనిపిస్తోంది. బాహుబలి చిత్రంలోని గుర్రాలు, రావు రమేష్ పోషించిన ఘోర పాత్ర, రాంచరణ్ గెటప్స్ తో ఆడియన్స్ థియేటర్స్ ముందు సందడి చేస్తున్నారు.

    థాంక్యూ జపాన్

    థాంక్యూ జపాన్

    మగధీర చిత్రానికి జపాన్ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన పట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. జపాన్ ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. మగధీర చిత్రంపై మీరు చూపిస్తున్న ప్రేమ నా హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. రాజమౌళి గారు అందించిన ఈ చిత్రం నా కెరీర్ లో మధుర జ్ఞాపకం అని రాంచరణ్ తెలిపాడు.

    ఆ చిత్రాలకు ధీటుగా

    ఆ చిత్రాలకు ధీటుగా

    జపాన్ లో రజనీకాంత్ ముత్తు, బాహుబలి2, అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ వంటి చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. ఆ చిత్రాలకు ధీటుగా మగధీర వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Ram Charan reaction after Magadheera gets massive response in Japan. Magadheera dubbed in Japanese
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X