దాసరికి దిమ్మతిరిగే రేంజ్ లో రామ్ చరణ్ రెస్పాన్స్..
న్యాయంగా రామ్ చరణ్ కి రావాల్సిన అవార్డుని దొడ్డిదారిలో దాసరి నారాయణ రావు తన్నుకుపోయాడని సాక్షాత్తూ పరిశ్రమ ప్రముఖులే అంటున్నారు. చిన్నికృష్ణ అయితే ఒక అడుగు ముందుకేసి ఆ అవార్డు అందుకోవడానికి దాసరి అనర్హుడని అనేశాడు. గత ఏడాది వచ్చిన చిత్రాలను గమనిస్తే చరణ్ కంటే ఆ అవార్డుకి అర్హమైన వాళ్లు మరొకరు లేరు. నంది తర్వాత చెప్పుకోతగ్గ అవార్డులన్నీ రామ్ చరణ్ నే వరించాయి.
నంది కూడా ఖచ్చితంగా అతనికే వస్తుందని అంతా అనుకుంటున్న సమయంలో తన పెద్దరికాన్ని నిలుపుకోకుండా చీప్ పాలిటిక్స్ ప్లే చేసి ఉత్తమ నటుడి అవార్డుని తన చెత్త నటనకు ఇచ్చేలా దాసరి పావులు కదిపాడు. పిల్లవాడి అవార్డుని కొట్టేశాడని దాసరిని అంతా ఎగతాళి చేస్తున్న నేపథ్యంలో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నందుకు అభినందనలు తెలుపుతూ దాసరికి చరణ్ ఒక పుష్పగుచ్చం పంపించాడు. చరణ్ ఇలా ప్రతిస్పందించడం పలువురి దృష్టిని ఆకర్షించింది. దాసరిని దేంతోనో కొట్టినట్టుగా చరణ్ చక్కగా ప్రతిస్పందించాడని, ఈ బొకే అందుకుని అయినా దాసరి సిగ్గు తెచ్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











