రామ్ చరణ్ రెడీ ఫర్ ‘ఆరెంజ్’
'మగధీర" గా తెలుగు సినీ పరిశ్రమలో అంతకుముందున్న రికార్డుల్ని తుడిచి పెట్టి, కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసిన రామ్ చరణ్, తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 7న లాంఛనంగా ప్రారంభం కానున్న 'ఆరెంజ్"(ఖరారు కాని టైటిల్) కోసం చరణ్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. 'మగధీర"తో పోల్చితే, తన తదుపరి చిత్రం పూర్తిగా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో వుంటుందంటోన్న చరణ్, ఫీల్ మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రంతో వస్తానని చెబుతున్నాడు.
'బొమ్మరిల్లు" భాస్కర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మిస్తోన్న సంగతి జరుగుతోంది. ఇందులో జెనీలియా ఒక హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ కోసం ఇంకా అన్వేషణ జరుగుతోంది. 'మగధీర" లో గుర్రపు స్వారీతో అదరగొట్టిన చరణ్, 'ఆరెంజ్" కోసం ఎలాంటి ఫీట్స్ చేస్తాడోనని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రం 12 వరకూ హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుని, అక్కడినుంచి ముంబైలో జరిగే షెడ్యూల్ కి షిఫ్ట్ కానున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











