»   » రామ్ చరణ్‌ బర్త్ డే: టాలీవుడ్ స్టార్స్, ఫ్యాన్స్ ట్వీట్లతో దద్దరిల్లుతున్న సోషల్ మీడియా!

రామ్ చరణ్‌ బర్త్ డే: టాలీవుడ్ స్టార్స్, ఫ్యాన్స్ ట్వీట్లతో దద్దరిల్లుతున్న సోషల్ మీడియా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan Birthday : Tollywood Celebs Showers Wishes

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నేడు 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ స్టార్లు, లక్షలాది మంది మెగా అభిమానులు ఆయన్ను విష్ చేస్తూ సోషల్ మీడియా దద్దరిల్లేలా చేస్తున్నారు. ఇప్పటికే రానా, కాజల్, శిరీష్‌తో పాటు చరణ్ వెల్ విషర్స్, అభిమానుల ట్వీట్లతో ట్విట్టర్, ఫేస్ బుక్ మార్మోగిపోతోంది.

రామ్ చరణ్ మార్చి 27, 1985లో చెన్నైలో జన్మించారు. 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా ఆయన హీరోగా పరిచయం అయ్యారు. దశాబ్దానికి పైగా సాగిన కెరీర్లో మగధీరతో పాటు ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. ఈనెల 30న రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ

రామ్ చరణ్ త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రామ్ చరణ్‌ను విష్ చేస్తూ ట్వీట్ చేసింది.

చిట్టి బాబు లైఫ్ లాంగ్ సంతోషంగా

రామ్ చరణ్‌తో ‘రంగస్థలం' సినిమా తెరకెక్కించిన మైత్రి మూవీ మేకర్స్ మా చిట్టి బాబు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

రానా దగ్గుబాటి

మై ఓల్డెస్ట్, బెస్టెస్ట్, ఫరెవరెస్ట్ స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రానా దగ్గుబాటి విష్ చేశారు.

అల్లు శిరీష్

రామ్ చరణ్ నా ఫేవరెట్ కజిన్... చాలా మంచి వ్యక్తి, తెలివైన వాడు అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.

కాజల్ విషెస్

తన బెస్ట్ కోస్టార్లలో రామ్ చరణ్ ఒకరని గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించిన కాజల్.... చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ అతడి తాజా చిత్రం ‘రంగస్థలం'కు బెస్టాఫ్ లక్ తెలియజేసింది.

హ్యాపీ బర్త్ డే సార్..

సార్... మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుతూ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్ చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గోవిందుడు అందరివాడే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

గోపీచంద్ మలినేని

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రామ్ చరణ్‌ను విష్ చేస్తూ ట్వీట్ చేశాడు.

దిల్ రాజు ఎస్.వి.సి

దిల్ రాజుకు చెందిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఎస్.వి.సి రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసింది.

ఉపాసన

రామ్ చరణ్ భార్య ఉపాసన మిస్టర్.సికి వినూత్నంగా పుట్టినరోజు విషెస్ తెలియజేసింది.

English summary
Rangasthalm star Ram Charan, who turned 33 today, is swamped by birthday wishes from celebs and friends. Rana Daggubati, Kajal Aggarwal, and several other Telugu celebs wished the mega power star and also shared rare photos with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X